
📌 Key Points
- బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కల్యాణ్ పడాల.
- తనూజ పుట్టస్వామి ఫస్ట్ రన్నరప్, డిమోన్ పవన్ సెకండ్ రన్నరప్.
- విన్నర్ కల్యాణ్ ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు.
- తనూజ పారితోషికం రూ. 37.5 లక్షలు, విన్నర్ కంటే ఎక్కువ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ముగిసింది. కల్యాణ్ పడాల ట్రోఫీ గెలుచుకోగా, తనూజ పుట్టస్వామి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. అయితే, విన్నర్ కల్యాణ్ ప్రైజ్ మనీ కంటే తనూజకు దక్కిన పారితోషికమే ఎక్కువ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బిగ్ బాస్ 9: విన్నర్ ఎవరు? రన్నరప్ ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా కల్యాణ్ పడాల ట్రోఫీ అందుకున్నాడు. ఫస్ట్ రన్నరప్ గా తనూజ పుట్టస్వామి, సెకండ్ రన్నరప్ గా డిమోన్ పవన్ నిలిచారు. విన్నర్ కాలేక పోయినా.. తనూజ ప్రేక్షకుల మనసుల్ని గెలిచిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. హౌస్ లో అడుగుపెట్టిన తొలిరోజుల్లో తనూజ ఏడుపులు, అరుపులు, కేకలు చూసి.. సీరియల్ యాక్టింగ్ టాలెంట్ చూపిస్తుందనుకున్నారు. కానీ.. ఆ తర్వాత తనూజ ఫ్యాన్స్ పెరిగారు. ఆమె నటించడం లేదని, తనలాగే ఉందని సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా.. ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఉన్న ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. మోడ్రన్ డ్రస్సులు వేసినా.. ఓవర్ గా కనిపించేది కాదు. అలాగే అబ్బాయిలను కూడా ఎంత హద్దుల్లో ఉంచాలో అలానే ఉంచేది.
105 రోజులపాటు హౌస్ లో ఉన్న తనూజ పారితోషికం.. విన్నర్ ప్రైజ్ మనీకంటే ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. విన్నర్ గా కల్యాణ్ రూ.35 లక్షలు అందుకున్న విషయం తెలిసిందే. 15 వారాలు హౌస్ లో ఉన్న తనూజ.. వారానికి రూ.2.50లక్షల చొప్పున 15 వారాలకు గాను రూ.37,50,000 సంపాదించినట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ప్రైజ్ మనీకంటే తనూజ రెమ్యూనరేషనే ఎక్కువ కదా. ఒకవేళ ఆమె విజేత అయి ఉంటే.. రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ, స్పానర్ ప్రైజ్ మనీ అంతా కలిపి.. రూ.77,50,000 సంపాదించి ఉండేది.
కల్యాణ్ ప్రైజ్ మనీ Vs తనూజ పారితోషికం
తనూజకు దక్కిన భారీ మొత్తం వెనుక అసలు లెక్క
మొత్తంగా, బిగ్ బాస్ 9లో విన్నర్ ట్రోఫీ మిస్ అయినా, తనూజ తన రెమ్యూనరేషన్‌తో పాటు అభిమానుల మనసులను గెలుచుకుంది. ఆమె సంపాదన లెక్కలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.


