
బాలీవుడ్ నటి తారా సుతారియా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆమె మరో నటుడితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అడార్ జైన్ తో విడిపోయాక ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Key Points
తారా సుతారియా, వీర్ పహరియా డేటింగ్‌లో ఉన్నారని వార్తలు
అడార్ జైన్‌తో బ్రేకప్ తర్వాత ఈ డేటింగ్ వార్తలు
లక్మే ఫ్యాషన్ వీక్, ఇతర ఈవెంట్లలో కలిసి కనిపించారు
వీర్ పహరియా గతంలో సారా అలీ ఖాన్‌తో డేటింగ్‌లో ఉన్నాడు
తారా సుతారియా, వీర్ పహరియా డేటింగ్ వార్తలు
సినీ ఇండస్ట్రీలో బ్రేకప్, డేటింగ్ అనే పదాలు చాలా కామన్. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో అయితే ఇవీ కాస్తా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తాజాగా మరో బాలీవుడ్ భామ డేటింగ్‌కు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ తారా సుతారియా మరో నటుడితో డేటింగ్ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. అడార్ జైన్‌తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ మరో బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ నటుడు వీర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు కొన్ని నెలల క్రితం డేటింగ్ ప్రారంభించారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇటీవల కొద్ది కాలంగా ఈ జంట పలుసార్లు ఈవెంట్లకు హాజరైనట్లు తెలుస్తోంది. లక్మే ఫ్యాషన్ వీక్‌తో పాటు ఎ సమ్మర్ ఆఫ్ స్టైల్ అనే ఈవెంట్‌లో జంటగా కనిపించారు.
అడార్ జైన్ తో బ్రేకప్ తర్వాత
కాగా.. మరోవైపు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్‌తో డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరు జంటగా స్కైఫోర్స్ అనే మూవీలో నటించారు. అయితే తమపై డేటింగ్ వార్తలపై ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. తారా సుతారియా అంతకుముందు ఆడార్ జైన్‌తో రిలేషన్‌లో ఉంది. అయితే 2023లో వారు విడిపోయిన తర్వాత.. అడార్ జైన్ తన స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నారు.
ఈవెంట్లలో కలిసి కనిపించిన జంట
గతంలో డేటింగ్‌పై వీర్ పహారియా మాట్లాడుతూ.. ‘నా రిలేషన్స్ గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. నాకు కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ వార్తలు వింటున్నా. అప్పుడు నేను పబ్లిక్ ఫిగర్ కాదు. అందుకే ఎవరూ నన్ను అడగలేదు. సోషల్ మీడియాలో ఏది ఉన్నా అది ప్రజలకు నిజమనిపిస్తుంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. కానీ నేను ఏం చేయగలను? అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను.’ అని అన్నారు.
తారా సుతారియా మరియు వీర్ పహరియా డేటింగ్ గురించి వచ్చిన వార్తలు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్. అయితే ఇద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు.


