|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

TBD Digital OTT: రూ.10కే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌!

Updated: 20-11-2025, 11:47 PM
TBD Digital OTT: రూ.10కే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌!

ఓటీటీ రంగంలో మరో సంచలనం. దుబాయ్ రాయల్ ర్యాప్చీ సంస్థ TBD డిజిటల్ OTTని కేవలం రూ.10 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో లాంచ్ చేసింది. దేశీ, కుటుంబ విలువలతో కూడిన కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ, చిన్న నిర్మాతలు, కొత్త ప్రతిభకు ఇది మంచి అవకాశంగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది.

Key Points

1

దుబాయ్ సంస్థ రాయల్ ర్యాప్చీ TBD డిజిటల్ OTTని హైదరాబాద్‌లో లాంచ్ చేసింది.

2

ఈ OTT కేవలం రూ.10 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

4

చిన్న నిర్మాతలు, కొత్త టాలెంట్‌కు సరైన వేదికగా TBD నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

రూ.10కే TBD డిజిటల్ OTT సేవలు

ఓటిటి రంగంలో మరో సంచలనం. దుబాయ్ దేశానికి చెందిన రాయల్ ర్యాప్చీ సంస్థ టీబీడీ డిజిటల్ ఓటీటీ ( TBD Digital OTT) ద్వారా అడుగు పెట్టింది. అది కూడా కేవలం పది రూపాయల నెలవారి సబ్ స్క్రిప్షన్ ఛార్జ్‌తో ఈ ఓటీటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో తమ లోగోను కూడా ఈ సంస్థ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత కేకే రాధ మోహన్ హాజరై, TBD యాప్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా టీబీడీ ఫౌండర్ ఎండీ ధరమ్‌గుప్తా మాట్లాడారు. తమ ఓటీడీలో దేశీ కంటెంట్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో కుటుంబం అంతా కూర్చుని చూసే విధంగా కంటెంట్ ఇస్తామని పేర్కొన్నారు. చిన్న పిల్లలు కూడా చూసే విధంగా , సె***క్స్ కంటెంట్ లేకుండా చూస్తామన్నారు. పది రూపాయలకే సబ్స్రిప్షన్ అనేది నెవర్ బిఫోర్ అంటూ వ్యాఖ్యానించారు. అందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరారు.

కుటుంబం అంతా చూసేలా దేశీ కంటెంట్

TBD సౌత్ సీఈఓ డీయస్‌ రావు మాట్లాడుతూ, ఓటిపి బిజినెస్ విషయంలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి సరైన అప్రోచ్ దొరకడం లేదని గుర్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో టీబీడీ రావడం వాళ్లకు ఒక అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. ఈ సంస్థ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు డీయ‌స్ రావు.

చిన్న నిర్మాతల ఆశాకిరణంగా TBD

ఇక టీబీడీ సౌత్ సీఈవో సముద్ర మాట్లాడుతూ, సౌత్ ఇండియాలో ఈ యాప్ లాంచ్ కు తెలుగు పరిశ్రమను ముందు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మంచి కంటెంట్ తయారు చేయండి, మేము మీకోసం పనిచేస్తామని వివరించారు. అన్ని భాషలలో సినిమాలు వెబ్ సిరీస్ లు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే ఆడియో రంగంలోకి అడుగు పెడతామని వెల్లడించారు. ముఖ్య అతిథి కె.కె. రాధా మోహన్‌మాట్లాడుతూ.. ఈ ఓటీటీ చిన్న అలాగే పెద్ద నిర్మాతలకు అండగా నిలబడుతుందన్నారు. తక్కువ సబ్ స్క్రిప్షన్ తో వస్తున్న ఈ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.

TBD డిజిటల్ OTT రాకతో తక్కువ ధరలో నాణ్యమైన దేశీ కంటెంట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. చిన్న నిర్మాతలు, కొత్త ప్రతిభకు ఇది గొప్ప వేదికగా నిలుస్తూ, తెలుగు సినీ పరిశ్రమకు మరింత ఊతమిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.