|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇది చిల్డ్ బీర్ లాంటి మూవీ.. ఎక్కడ పర్మిషన్‌లు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేశాం అంటున్న టీమ్

Published: 11-11-2025, 1:39 PM
ఇది చిల్డ్ బీర్ లాంటి మూవీ.. ఎక్కడ పర్మిషన్‌లు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేశాం అంటున్న టీమ్

రోహిత్, శశి దర్శకత్వం వహించిన ‘గోపిగాళ్ల గోవా ట్రిప్’ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం మాట్లాడుతూ, పర్మిషన్లు లేకుండానే షూటింగ్ పూర్తి చేశామని, ఇది చిల్డ్ బీర్ లాంటి సినిమా అని వెల్లడించారు.

Key Points

1

'గోపిగాళ్ల గోవా ట్రిప్' చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.

2

దర్శకులు రోహిత్, శశి ప్రకారం ఇది 'చిల్డ్ బీర్ లాంటి' మూవీ.

4

ఈ రూట్ ఫిలిం 90% అవుట్ డోర్ లోనే చిత్రీకరణ జరుపుకుంది.

‘గోపిగాళ్ల గోవా ట్రిప్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

రోహిత్ అండ్ శశి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘గోపిగాళ్ల గోవా ట్రిప్’. ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతున్న సందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రోహిత్ అండ్ శశి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఐడియా అనుకున్న 15వ రోజే షూటింగ్‌లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక రిమోట్ విలేజ్‌లో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రకమైన రూట్ ఫిలిం. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ మధ్యలో షూటింగ్ చేశాం. ఎక్కడ పర్మిషన్‌లు కూడా లేవు. సినిమా 90% అవుట్ డోర్ లోనే ఉంటుంది. ఇది చాలా మెమొరబుల్ షూట్. ఈ మూవీ.. చిల్డ్ బీర్ లాంటి మూవీ. ఇలాంటి మూవీని మీడియా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా.. ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమాను రాస్తా ఫిలిమ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

పర్మిషన్లు లేకుండానే షూటింగ్: చిత్ర బృందం కామెంట్స్

“చిల్డ్ బీర్” లాంటి మూవీ: డైరెక్టర్ రోహిత్ మాటలు

‘గోపిగాళ్ల గోవా ట్రిప్’ సినిమా షూటింగ్ అనుభవాలు, పర్మిషన్లు లేని విధానం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నవంబర్ 14న విడుదల కానున్న ఈ రూట్ ఫిలిం ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.