
బుల్లితెర నటి తేజస్విని గౌడ తాజాగా ‘కాకమ్మ కథలు’ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆమె బాధను, అనుభవాలను పంచుకుంది.
Key Points
తేజస్విని గౌడ తన తండ్రి గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది.
ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తండ్రిని కోల్పోయింది.
తల్లి ఆమెను బాగా చూసుకుంది.
కొన్ని సందర్భాల్లో తండ్రి ఉంటే బాగుండు అనిపించిందని తెలిపింది.
తేజస్విని గౌడ ఎమోషనల్ టాక్
బుల్లితెర పై సీరియల్స్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న తేజస్విని గౌడ(Tejaswini Gouda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ మన్ననలు పొందింది. కన్నడ యాక్టర్ అయినప్పటికీ మన తెలుగు కుర్రాడు అమర్ దీప్(Amar Deep)ని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ జంటకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం తేజస్విని టీవీ షోలు, సీరియల్స్‌తో బిజీగానే ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆహా ఓటీటీ(AHA OTT)లో వస్తున్న ‘కాకమ్మ కథలు’(Kakamma Kathalu) ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి రాగా అక్కడ తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.
ఆమె మాట్లాడుతూ.. నేను ఇంటర్ చదివే సమయంలో నా తండ్రి హార్ట్ అటాక్‌తో చనిపోయారు. అలా పెరుగుతున్న ఏజ్‌లో నాన్న లేకపోవడంతో చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఫాదర్ లేకపోయినా అమ్మ బాగా చూసుకుంది. కానీ నాన్న నాకెందుకు లేరు అని బాధగా ఉంటుంది. గత రెండేళ్లలో వచ్చిన కొన్ని పరిస్థితుల్లో నాన్న ఈ టైంలో ఉంటే బాగుండేది కదా అనిపించేది’ అని చెప్తూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ స్ట్రాంగ్‌గా ఉండండి అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తండ్రి మరణం గురించి వెల్లడి
ఫ్యాన్స్ స్పందన
తేజస్విని గౌడ తన ఎమోషనల్ అనుభవాలను పంచుకోవడం అభినందనీయం. ఆమె బలాన్ని చూసి ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. తండ్రి లేకపోవడం వల్ల వచ్చిన ఖాళీని ఆమె తన బలంతో భర్తీ చేసుకుంటోంది.


