|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భూభారతి విప్లవం: తెలంగాణాలో సరికొత్త శకం ప్రారంభం!

Published: 26-03-2026, 1:05 PM
భూభారతి విప్లవం: తెలంగాణాలో సరికొత్త శకం ప్రారంభం!
  • ఏప్రిల్ 2 నుంచి 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద భూభారతి పోర్టల్ సేవలు ప్రారంభం
  • ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు సులభతర సేవలే లక్ష్యంగా భూభారతి రూపకల్పన
  • భూలావాదేవీల వివరాలు పారదర్శకంగా చూపేలా పోర్టల్ రూపకల్పన
  • రైతులు ఆధార్ నెంబరుతో లాగిన్ అయ్యి భూ వివరాలు తెలుసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఇది రైతులకు మరింత సులభంగా భూమి వివరాలు పొందేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.

భూభారతి పోర్టల్ ఆవిష్కరణ

రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్, ఎన్ఐసీ అధికారుల‌తో భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకున్నందున సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు అత్యంత పార‌ద‌ర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్‌ని రూపొందించామన్నారు.

నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండ‌లాల్లో ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.

పైలట్ ప్రాజెక్ట్ వివరాలు

పైల‌ట్ మండ‌లాల్లో మెరిట్-డీమెరిట్‌ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి వాటికి అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేసి రెండో ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమ‌లు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేష‌న్ , స‌ర్వే విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ ప్రతి భూలావాదేవీ వివ‌రాలు పార‌ద‌ర్శకంగా క‌నిపించేలా ఈ పోర్టల్‌ను రూపొందించినట్టుగా మంత్రి పొంగులేటి వివరించారు.

‘పోర్టల్‌లో ప్రధానంగా స‌మాచార సేవ‌లు, స‌ర్వే సేవ‌లు, క‌రెక్షన్ సేవ‌లు, అప్పీల్ సేవ‌లు, రిజిస్ట్రేష‌న్ సేవ‌లతోపాటు సిటిజ‌న్ డాష్ బోర్డు సేవ‌ల‌కు సంబంధించి మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్స్‌, రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ వివ‌రాలు, ఫీడ్‌బ్యాక్‌, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్‌, భూధార్ నెంబ‌ర్‌, ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, మ్యూటేష‌న్, ఈసీ, మార్కెట్ విలువ‌, విలేజ్ మ్యాప్‌, ప్రతి స‌ర్వేనెంబ‌ర్‌కు మ్యాప్‌, గ్రామాల న‌క్షా, పాస్ బుక్ క‌రెక్షన్‌ వంటి పూర్తి స‌మాచారం, సేవ‌లు ల‌భించేలా మూడు విభాగాల‌ను అనుసంధానం చేస్తూ భూభార‌తి పోర్టల్ సకల సమాచారంతో సేవలందిస్తుంది.’ అని మంత్రి పొంగులేటి చెప్పారు.

రైతులకు అందుబాటులో సేవలు

రైతులు ఆధార్ నెంబరుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా భూభారతి పోర్టల్లో లాగిన్ అయ్యి భూములకు సంబంధించిన వివరాలను పొందవచ్చని పొంగులేటి పేర్కొన్నారు. రిజిస్ట్రేష‌న్‌, ఇత‌ర భూసేవ‌ల‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న మొదలు ప్రక్రియ పూర్తయ్యే వ‌ర‌కు ప్రతి స్థాయిలో వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి స‌మాచారం అందుతుందన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్లో 36 మాడ్యూల్స్ ఉండ‌గా భూభార‌తి పోర్ట‌ల్లో ఒకే ఛాప్టర్ కింద తీసుకువ‌చ్చామన్నారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

మొత్తానికి, భూభారతి పోర్టల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలనలో ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. ఇది రైతులకు మరింత పారదర్శకమైన మరియు సులభతరమైన సేవలను అందించడానికి ఉద్దేశించబడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.