
📌 Key Points
- తెలంగాణలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు.
- నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి.
- మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.
- పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ప్రజలకు హెచ్చరిక.
తెలంగాణలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో వాతావరణ మార్పులు: ఐఎండీ అంచనా
Telangana Heavy Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోనుంది. రాగల నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జూన్ 22 ఉదయం నుంచి జూన్ 23 ఉదయంలోపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్: వర్షాల తీవ్రత
జూన్ 23 ఉదయం నుంచి జూన్ 24 ఉదయం 8:30 గంటల వరకు వర్షాల తీవ్రత ఉంటుంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక జూన్ 26 నుంచి జూన్ 28 వరకు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ సూచనలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ శాఖ సూచనలను పాటించి, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు కోరారు. ఇది ప్రజల భద్రతకు అత్యవసరం.


