|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాట్సాప్‌లో సర్టిఫికేట్లు.. అప్లై చేస్తే అడ్రస్ గల్లంతు! ఎక్కడికో పోతున్నాయ్!

Published: 11-03-2026, 3:05 AM
వాట్సాప్‌లో సర్టిఫికేట్లు.. అప్లై చేస్తే అడ్రస్ గల్లంతు! ఎక్కడికో పోతున్నాయ్!
  • తెలంగాణలో వాట్సాప్ ద్వారా 580 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
  • కులం, ఆదాయం వంటి సర్టిఫికేట్ల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
  • వాట్సాప్ నంబర్ 80969 58096 కు ‘హాయ్’ పంపడం ద్వారా సేవలను పొందవచ్చు.
  • సర్టిఫికేట్ కోసం ఒకచోట అప్లై చేస్తే, అది వేరే చోటికి వెళ్తోందని వినియోగదారుల ఆరోపణ.

తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలను ప్రారంభించింది. దీని ద్వారా కులం, ఆదాయం వంటి సర్టిఫికేట్లను సులభంగా పొందవచ్చు. అయితే, కొన్ని దరఖాస్తులు వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.

వాట్సాప్‌లో మీసేవా సేవలు ఎలా పొందాలి?

తెలంగాణ ప్రభుత్వం మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సాప్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ధృవీకరణ తర్వాత పౌరులు చాలా రకాల సేవలు పొందవచ్చు. మీసేవా వాట్సాప్ సర్వీసెస్ పౌరులకు సరళమైన చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందేలా చేస్తుంది. తెలంగాణ అంతటా పౌరుల మొబైల్ ఫోన్‌లకు ప్రభుత్వ సేవలను తీసుకురావడంపై చాలా ప్రశంసలు వచ్చాయి.

వాట్సాప్‌లోనే కులం, ఆదాయం, నివాసం, బర్త్, డెత్, సర్టిఫికేట్లు అప్లై చేసుకోవచ్చు. సుమారు 580 సేవలను రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తోంది. వాట్సాప్ సేవల ద్వారా రోజులతరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోతుంది. మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. ఇంట్లో కూర్చొని కావాల్సిన సర్వీస్ అప్లై చేయవచ్చు.

వాట్సాప్ సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా 5,000 మీసేవా సేవా కేంద్రాల నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హాల్ టిక్కెట్లు, వాతావరణ సమాచారం, ప్రభుత్వ హెచ్చరికల నుండి బస్సు టిక్కెట్ల బుకింగ్ వరకు, భవిష్యత్తులో అనేక సేవలు దీనికి యాడ్ చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం

అయితే ఈ వాట్సాప్ మీ సేవ హైదరాబాద్ ప్రజలకు‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపై కాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, బర్త్, డెత్ వంటి సర్టిఫికెట్ల కోసం మీసేవా కేంద్రాల వద్ద లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఎలా అప్లై చేయాలి.

సమ్మర్ తర్వాత కాలేజీ అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది. వాట్సాప్ నంబర్ 80969 58096 కు ‘హాయ్’ పంపడం ద్వారా ఈ సేవను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు జనన, మరణ, కులం వంటి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యుత్, వాటర్ అలాగే ఆస్తి పన్ను వంటి యుటిలిటీలకు చెల్లింపులు చేయవచ్చు. పోలీసు చలాన్ చెల్లింపులను చెల్లించవచ్చు, దరఖాస్తులను ట్రాక్ చేయవచ్చు. జారీ చేసిన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు

అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పలు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సర్టిఫికేట్ కోసం ఒక చోట అప్లై చేస్తే మరో చోటికి వెళ్తుందని వినియోగదారులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన శిరీష అనే మహిళ వాట్సాప్ ద్వారా ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇటీవల అప్లై చేశారు. కానీ అది వేరే మండలానికి వెళ్లింది.

‘వాట్సాప్ ద్వారా నేను ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేశాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి సంబందించి అప్లై చేస్తే అది రామగుండం దగ్గరలోని అంతర్గాం వెళ్లింది. అక్కడి నుంచి కాల్ చేసి మాట్లాడారు. వాట్సాప్ ద్వారా తప్పుగా చూపిస్తుందని, మీ సేవా కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవాలని సలహా ఇచ్చారు.’ అని శిరీష వెల్లడించారు.

వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, దరఖాస్తులు సరైన చోటికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలను పరిష్కరిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.