|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు వచ్చేశాయ్! మీ భవితవ్యం ఇప్పుడే తెలుసుకోండి!

Published: 10-04-2026, 2:35 AM
  • తెలంగాణలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది.
  • మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఫలితాల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
  • ఎంపికైన అభ్యర్థుల మార్కులు, మెరిట్ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచబడ్డాయి.
  • వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ ఫలితాలు విడుదలయ్యాయి. దీని ద్వారా 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఫలితాలకు సంబంధించిన వివరాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల విడుదల

తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితంగా వైద్యారోగ్యశాఖలో కీలకమైన 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఫలితాలకు సంబంధించిన వివరాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB వెబ్ సైట్ లో ఉంచారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత…. రాత పరీక్షలను నిర్వహించారు. గతేడాది డిసెంబర్ లోనే ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను రిలీజ్ చేశారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. మిగతా ప్రక్రియలు కూడా పూర్తి కావటంతో… తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.

వెబ్‌సైట్‌లో ఫలితాల వివరాలు

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారితో పాటు పరీక్ష రాసిన మిగిలిన అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను అందుబాటులో కూడా వెబ్ సైట్ లో ఉంచారు. ఫలితంగా అభ్యర్థులు వారి మెరిట్ వివరాలను నేరుగా చూసుకునే అవకాశం కల్పించారు.

గడిచిన రెండేళ్లుగా తెలంగాణ వైద్యారోగ్య నుంచి అనేక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్, ఫ్రొఫెసర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్స్ తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిక్రూట్ మెంట్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీతో పాటు ఖాళీలపై ఆరా తీస్తున్నారు.

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కావడం నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం మరింత వేగంగా ఖాళీలను భర్తీ చేస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.