
📌 Key Points
- తెలంగాణలో ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు
- 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12న పునఃప్రారంభం
- సిలబస్ పూర్తి చేయడానికి అదనపు తరగతులు నిర్వహించే అవకాశం
- ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హాఫ్ డే స్కూల్స్
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుండి సెలవులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో వేసవి సెలవుల ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అధికారికంగా వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి 2026 జూన్ 11 వరకు 48 రోజుల సమ్మర్ హాలిడేస్ లభించనున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు 2026 జూన్ 12న తిరిగి తెరుస్తారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే విద్యా సంస్థలు వారానికి అదనపు తరగతులను నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం
ఫిబ్రవరి నెల ప్రారంభంలో విద్యార్థులు తీవ్రమైన వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి వీలుగా ప్రభుత్వం హాఫ్ డే స్కూళ్లపై ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు హాఫ్ డే స్కూల్ షెడ్యూల్‌ను అనుసరించాలని విద్యా శాఖ ఆదేశించింది.
హాఫ్ డే స్కూల్స్‌పై విద్యాశాఖ ఆదేశాలు
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు వేసవి వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. సెలవులను సద్వినియోగం చేసుకుని నూతన ఉత్సాహంతో పాఠశాలలకు సిద్ధం కండి.


