|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, సినీ రైటర్‌ అందెశ్రీ కన్నుమూత..

Published: 09-11-2025, 11:04 PM
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, సినీ రైటర్‌ అందెశ్రీ కన్నుమూత..

ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సాహిత్యానికి, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం.

Key Points

1

ప్రజా కవి, సినీ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు.

2

తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ"ను రచించారు.

4

తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించి ప్రజలను చైతన్యం చేశాయి.

అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ దిగ్భ్రాంతి

ప్రజా కవి, సినిమా పాటల రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రాసిన అందె శ్రీ(64) ఇక లేరు. ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆదివారం ఇంట్లో అస్వస్థతకు గురైన ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ సమాజం తీవ్రం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ పాటకి తీరని లోటని, పలువురు రచయితలు, తెలంగాణ వాదులు కొనియాడుతూ, సంతాపం తెలియజేస్తున్నారు.

అందెశ్రీ అనేక విప్లవాత్మక, అభ్యూదయ పాటలను రాశారు. తెలంగాణ కవిగా పాపులర్‌ అయ్యారు. తెలంగాణ రచనకు సంబంధించి విశేష సేవలందించారు. 2006లో `గంగ` అనే సినిమాకి గానూ నంది అవార్డుని అందుకున్నారు. వీటితోపాటు 2014లో అకాడమి ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్ పీల్‌ డాక్టరేట్‌ని పొందారు. 2015లో దాశరథి సాహితి పురస్కారం దక్కించుకున్నారు. అలాగే అదే ఏడాది రావూరి భరద్వాజ సాహితి పురస్కారం దక్కింది. ఆర్‌ నారాయణ మూరి తీసిన అనేక చిత్రాలకు అందెశ్రీ పాటలు రాయడం విశేషం. తన పాటలతో ప్రజలను చైతన్యం చేయడంలో అందె శ్రీది పాట ప్రభావం ఎంతో ఉందని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాటలు ఉర్రూతలూగించాయి. ఉద్యమం సక్సెస్‌ కావడంతో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు.

అందెశ్రీకి దక్కిన అవార్డులు, పురస్కారాలు

తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాటల ప్రభావం

అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి, పాటకి తీరని లోటు. ఆయన స్ఫూర్తిదాయక రచనలు, ఉద్యమ పాటలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.