|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ వీరరాజు 1991 – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Published: 31-05-2025, 6:15 AM
థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ వీరరాజు 1991 - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ‘వీరరాజు 1991’ థియేటర్లలో విడుదలైన వారం రోజుల్లోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. రుద్ర విరాజ్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. 1991 నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Key Points

1

వీరరాజు 1991 థియేటర్లలో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి!

2

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న యాక్షన్ థ్రిల్లర్.

4

1991 నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుడి జీవితం ఆధారంగా రూపొందింది.

వీరరాజు 1991: థియేటర్ నుండి ఓటీటీకి

తెలుగు మూవీ వీర‌రాజు 1991 థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. రుద్ర విరాజ్ హీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అజ‌య్ ఘోష్‌, బెన‌ర్జీ, అర్చ‌న, గోప‌రాజు ర‌మ‌ణ‌ కీల‌క పాత్ర‌లు పోషించారు.

వీర‌రాజు 1991 మూవీ మే 22న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ప‌ది రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేసింది. 1991లో నెల్లూరు జిల్లాలో మ‌త్స్య‌కారుడి జీవితంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో మేక‌ర్స్ ఈ మూవీని తెర‌కెక్కించారు. గ‌గ‌న్ బ‌దేరియా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

కథానాయకుడు మరియు దర్శకుడు రుద్ర విరాజ్

వీర‌రాజు ఓ మ‌త్స్య‌కారుడు. చేప‌లు ప‌ట్టుకుంటూ జీవిస్తుంటాడు. అన్యాయాన్ని అస్స‌లు స‌హించ‌డు. ఓ రాజ‌కీయ‌నాయ‌కుడు చేసే అన్యాయాల‌కు వీర‌రాజు ఎదురుతిరుగుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? త‌న అధికారం, ప‌లుకుబ‌డితో వీర‌రాజును చంపాల‌ని ఆ నాయ‌కుడు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఈ పోరాటంలో ఊరివాళ్లు వీర రాజుకు ఎలా అండ‌గా నిలిచారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

వీర‌రాజు 1991 మూవీ థియేట‌ర్ల‌ లో రిలీజైన విష‌యం తెలియ‌కుండానే వెళ్లిపోయింది. క‌మ‌ర్షియ‌ల్‌గా స‌రైన విజ‌యాన్ని అందుకోలేక‌పోవ‌డంతోనే వారం రోజుల్లోనే మేక‌ర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసిన‌ట్లు స‌మాచారం. హీరోగా, డైరెక్ట‌ర్‌గా రుద్ర విరాజ్‌కు ఇదే ఫ‌స్ట్ మూవీ.

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమా

ఈ వారం ఓటీటీలోకి వీర‌రాజు 1991తో పాటు నాని హిట్ 3 , సూర్య రెట్రో, మోహ‌న్ లాల్ తుడ‌రుం సినిమాలు వ‌చ్చాయి. వీటితో పాటు త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.హిట్ 3, రెట్రో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోండ‌గా…తుడ‌రుం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

కమర్షియల్‌గా సరైన విజయం సాధించలేకపోవడంతో వీరరాజు 1991 సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.