|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి నిన్న వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- తండ్రిని కాపాడుకునే కూతురు కథ- మనసుకు హత్తుకునే సీన్లతో- ఇక్కడ చూసేయండి!

Published: 03-08-2025, 8:15 PM
ఓటీటీలోకి నిన్న వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- తండ్రిని కాపాడుకునే కూతురు కథ- మనసుకు హత్తుకునే సీన్లతో- ఇక్కడ చూసేయండి!

తెలుగు ఓటీటీలో మరో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘థాంక్ యూ నాన్న’ విడుదలైంది. తండ్రిని కాపాడుకునే కూతురు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో వి. జయప్రకాష్, అనుమిత దత్తా ప్రధాన పాత్రలు పోషించారు.

‘థాంక్ యూ నాన్న’ కథాంశం

ఓటీటీలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తండ్రి గొప్పదనం గురించి చెప్పే కథలు ఎన్నో ప్రతివారం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా నిన్న (ఆగస్ట్ 3) కూడా మరో తండ్రీకూతుళ్ల కథతో తెలుగులో ఓ సినిమా ఓటీటీ రిలీజ్ అయింది.

ఆ సినిమానే థాంక్ యూ నాన్న. తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా థాంక్ యూ నాన్న తెరకెక్కింది. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై థాంక్ యూ నాన్న సినిమాను ప్రముఖ నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సురేంద్ర ఉన్నారు.

థాంక్ యూ నాన్న సినిమాకు జై కథ, దర్శకత్వం వహించారు. మనసుకు హత్తుకునే డైలాగ్స్ ఉన్న థాంక్ యూ నాన్న సినిమాకు తిమ్మర్ రెడ్డి వంకా డైలాగ్స్, స్క్రీన్ ప్లే అదించారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా పసుపులాటి రామకృష్ణ, ఎడిటర్‌గా రాఘేంద్ర వర్మ పనులు చేశారు. డాక్టర్ జోసీభట్ల బీజీఎమ్ అందించంగా పాటలకు వేదుల కిరణ్ కుమార్ సంగీతం అందించారు.

నటీనటుల వివరాలు

ఎమోషనల్ రైడ్‌గా సాగే థాంక్ యూ నాన్న సినిమాలో ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు వి జయప్రకాష్ ప్రధాన పాత్ర పోషించారు. తండ్రి పాత్రలో జయప్రకాష్ నటించగా కూతురుగా అనుమిత దత్తా చేశారు. గుల్లిపల్లి శ్రీధర్ రావు, గోపీ గణేష్, ఝాన్సీ గుగులోత్, పి సుధాకర్ రెడ్డి, రిషవ్ సుచంటి, మృదుల పద్మ, సందీప్ దేశ్‌పాండే తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

తల్లి లేను ముగ్గురు పిల్లలను తండ్రి జాగ్రత్తగా పెంచుతాడు. వారిలో ఓ కూతురు కూడా ఉంటుంది. అబ్బాయిలను పెంచడం వేరు, అమ్మాయిని పెంచడం వేరు అని డైలాగ్‌తో తండ్రి మీద కూతురుకు ఎంత ప్రేమ ఉందో థాంక్ యూ నాన్న ట్రైలర్‌లో చూపించారు. అన్నీ తానై పెంచిన తండ్రి హాస్పిటల్‌లో పడినప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఎలా చూసుకున్నారు అనే కథతో థాంక్ యూ నాన్న తెరకెక్కినట్లు తెలుస్తోంది.

తండ్రిని చూసుకునే క్రమంలో తమ కొడుకుల భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడే కుమారులు, కన్నతండ్రిని కాపాడుకోవాలని కూతురు చేసే ప్రయత్నంగా థాంక్ యూ నాన్న సినిమా ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. మనసుకు హత్తుకునే సీన్లతో, భావోద్వేగపు డైలాగ్స్‌తో థాంక్ యూ నాన్న మూవీ ఉన్నట్లు అర్థం అవుతోంది.

ఎక్కడ చూడాలి?

మంచి ఎమోషనల్ ఫీల్ ఇచ్చే థాంక్ యూ నాన్న ఓటీటీలో ఆదివారం (ఆగస్ట్ 3) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్‌లో థాంక్ యూ నాన్న ఓటీటీ రిలీజ్ అయింది. ప్రతి ఆదివారం ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధా నుంచి వచ్చే సినిమాల్లో భాగంగా ఈ వారం థాంక్ యూ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీ లో ఇటీవల ఎక్కువగా తండ్రి గొప్పతనం చెప్పే కథలు వస్తున్నాయి. అన్ని ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా జోనర్లలో ఉంటున్నాయి. ఇక తాజాగా కేవలం 28 నిమిషాల 49 సెకన్ల రన్ టైమ్‌తో వచ్చిన థాంక్ యూ నాన్న సినిమాను ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

మనసుకు హత్తుకునే సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో ‘థాంక్ యూ నాన్న’ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.