|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పహల్గామ్ ఉగ్రదాడి ప్రదేశంలో తెలుగు సినిమా షూటింగ్‌

Published: 05-11-2025, 3:31 AM
పహల్గామ్ ఉగ్రదాడి ప్రదేశంలో తెలుగు సినిమా షూటింగ్‌

దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ప్రదేశంలో తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 26 మందిని బలి తీసుకున్న ఆ దాడి జరిగిన ఆరు నెలల తర్వాత ఇది జరగడం విశేషం. విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శ్రీనగర్‌లో దాడి తర్వాత జరుగుతున్న తొలి సినిమా షూటింగ్.

Key Points

1

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆరు నెలలకు సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

2

శ్రీనగర్‌లో దాడి అనంతర తొలి సినిమా షూటింగ్ ఇదే.

4

పహల్గామ్ అందమైన పర్యాటక ప్రదేశం, షూటింగ్స్‌కు అనుకూలం.

పహల్గామ్‌లో పునరుద్ధరించబడిన సందడి

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 26 మందిని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన తరవాత ఆరు నెలలకు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఉగ్రదాడి తరవాత శ్రీనగర్ లో జరుగుతున్న మొదటి సినిమా షూటింగ్ ఇదే. ఈ చిత్రానికి విమల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఇది తెలుగు సినిమా కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే ప‌హ‌ల్గామ్ దాడి త‌ర‌వాత కొన్ని రోజుల పాటు అక్క‌డ ఆంక్ష‌లు విధించారు. త‌ర‌వాత ఆంక్షలు ఎత్తివేసి భ‌ద్ర‌త పెంచారు. మెల్లి మెల్లిగా ప‌ర్యాట‌కులు సైతం ప‌హ‌ల్గామ్ లో ప‌ర్య‌టిస్తున్నారు. క‌శ్మీర్ లోనే ప‌హ‌ల్గామ్ సుంద‌ర‌మైన ప్ర‌దేశం అని ప‌ర్యాట‌కులు చెబుతుంటారు. దీంతో అక్క‌డ చాలా సినిమా షూటింగ్లు సైతం జ‌రుగుతుంటాయి. దాడి త‌ర‌వాత ఇంతకాలం బ్రేక్ ప‌డ‌గా మ‌ళ్లీ షూటింగ్ లు మొద‌ల‌వ్వ‌డంతో అక్క‌డ‌ సంద‌డి నెల‌కొంది. VIDEO

ఉగ్రదాడి తర్వాత మొదటి షూటింగ్

తెలుగు దర్శకుడు విమల్ కృష్ణ ప్రత్యేకత

ఉగ్రదాడి ఘటన తర్వాత పహల్గామ్‌లో తిరిగి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావడం శుభపరిణామం. ఇది కాశ్మీర్ పర్యాటకం, సినిమా పరిశ్రమ తిరిగి పుంజుకోవడానికి సంకేతం, స్థానికులకు కొత్త ఆశలను రేకెత్తిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.