
📌 Key Points
- కానిస్టేబుల్ నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.
- అల్లూరి జిల్లాకు చెందిన బాబురావు రోడ్డు సమస్యను సీఎం దృష్టికి తెచ్చాడు.
- సీఎం చంద్రబాబు బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అప్పగించారు.
- నిమిషాల్లోనే తెనుములబండ గ్రామానికి రూ. 2 కోట్లతో రోడ్డు మంజూరైంది.
ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. కానిస్టేబుల్ నియామక సభలో సీఎం చంద్రబాబు సూచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిమిషాల్లోనే ఓ గిరిజన గ్రామానికి రోడ్డు మంజూరు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వేగవంతమైన నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కానిస్టేబుల్ నియామక సభలో ఆసక్తికర ఘటన
Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సీఎం అమరావతి, ఏపీ డెవలప్మెంట్ చూసుకుంటుంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాల అభివృద్ధి, రోడ్లు, తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు అన్ని చూసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా నూతనంగా నియామకం జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాలను అందించే కార్యక్రమం మంగళగిరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత హాజరయ్యారు.(Pawan Kalyan)
ఈ కార్యక్రమంలో కింద స్థాయి నుంచి, గ్రామాల నుంచి వచ్చి సక్సెస్ అయిన పలువురు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన వారిని స్టేజిపైకి పిలిచి అభినందించారు. వారితో మాట్లాడించారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన బాబురావు అనే యువకుడు స్టేజిపై తమ గ్రామానికి రోడ్డు వేయించాలని సీఎం చంద్రబాబుని అడిగాడు.
సీఎం చంద్రబాబు ఆదేశం, పవన్ కళ్యాణ్ తక్షణ స్పందన
దీంతో సీఎం చంద్రబాబు.. తన గ్రామం గురించి ఆలోచించిన ఆ అబ్బాయిని అభినందించి.. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇది మీ బాధ్యత. రోడ్డు వేయించే బాధ్యత మీదే. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటికి కనెక్టివిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.
అలా స్టేజిపైనే పవన్ కి చంద్రబాబు విజ్ఞప్తి చేయడంతో వెంటనే నిమిషాల్లో సభ పూర్తయ్యేలోపే ఆ గ్రామానికి రోడ్డు మంజూరు చేసారు పవన్ కళ్యాణ్. బాబూరావు కోరిక మేరకు, సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి రోడ్డు వేయమని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో అధికారులు తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ కి తెలపగా దాన్ని ఆమోదించారు పవన్. నేటి నుంచే ఈ రోడ్డు పనులు మొదలవ్వాలి అని ఆదేశించారు పవన్.
నిమిషాల్లోనే రూ. 2 కోట్లతో రోడ్డు మంజూరు
పవన్ ఇప్పటికే అనేక గిరిజన గ్రామాలకు రోడ్డు, కరెంట్, నీటి వసతులు ఇస్తున్నారు. ఇలా ఏకంగా సీఎం అడగడం, అడిగిన వెంటనే పని పూర్తి చేయడంతో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని పవన్ ని మరోసారి అభినందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తక్షణ నిర్ణయం ఆయన నిబద్ధత, పాలన వేగాన్ని స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో గ్రామాల అభివృద్ధికి పవన్ కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇది సుపరిపాలనకు శుభసూచకం.


