
సంవత్సరం క్రితం విడుదలైన ‘బ్రహ్మవరం పీఎస్ పరిధిలో’ అనే తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. 8.6 IMDb రేటింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Key Points
8.6 IMDb రేటింగ్‌తో అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్!
ఏడాది తర్వాత ఓటీటీలో విడుదలైంది!
అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది!
క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ ప్రేమికులకు తప్పక చూడాల్సిన సినిమా!
బ్రహ్మవరం పీఎస్ పరిధిలో: కథాంశం
ఓటీటీ సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారుండరు. ఎంత ఎంగేజింగ్, థ్రిల్లింగ్‌గా తెరకెక్కిస్తే అవి అంత రెస్పాన్స్ అందుకుంటాయి. అయితే, తెలుగులో ఇటీవల కాలంలో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ వస్తూనే ఉంటున్నాయి. అలా, సంవత్సరం క్రితం థియేటర్లలో విడుదలైన తెలుగు క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే బ్రహ్మవరం పీఎస్ పరిధిలో.
ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించిన బ్రహ్మవరం పీఎస్ పరిధిలో మూవీలో గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి బెల్లంకొండ, బలగం రూప లక్ష్మీ, యాంకర్ హర్షిణి, సమ్మెట గాంధీ, జీవా, ప్రేమ్ సాగర్, రుద్ర తిప్పే స్వామి నటించారు. డిఫరెంట్ షేడ్స్‌తో క్రైమ్, మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు.
బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ ముందు తల లేని ఓ శవం పోలీసులకు దొరుకుతుంది. అది ఎవరిది, ఎవరు హత్య చేశారు అనే విషయాలు కనుక్కునే క్రమంలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయనేదే ఈ సినిమా కథ. గతేడాది ఆగస్ట్ 23న థియేటర్లలో బ్రహ్మవరం పీఎస్ పరిధిలో సినిమా విడుదలైంది.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
అయితే స్టార్ హీరో హీరోయిన్ల్, పాపులర్ యాకట్ర్స్ ఎవరు లేకుండా కేవలం క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆదరణ దక్కించుకోలేదు. కానీ, ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం 10కి ఏకంగా 8.6 రేటింగ్ అందుకుంది బ్రహ్మవరం పీఎస్ పరిధిలో మూవీ.
ఇక ఇన్నాళ్లు ఓటీటీ రిలీజ్‌కు నోచుకోని ఈ సినిమా నిన్న అంటే శుక్రవారం (ఆగస్ట్ 23) డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో బ్రహ్మవరం పీఎస్ పరిధిలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏడాది తర్వాత ఓటీటీ రిలీజ్ అయిన బ్రహ్మవరం పీఎస్ పరిధిలో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ మూవీపై ఓ లుక్కేయొచ్చు.
ఓటీటీ విడుదల మరియు ప్రతిచర్య
ఇక బ్రహ్మవరం పీఎస్ పరిధిలో కథ విషయానికొస్తే.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చైత్ర (స్రవంతి బెల్లంకొండ) పని చేస్తుంటుంది. తనను ఇష్టపడే వ్యక్తి భర్తగా రావాలని కోరుకునే చైత్ర సూర్య (సూర్య శ్రీనివాస్)తో ప్రేమలో పడుతుంది. మరోవైపు గౌతమ్ (గురు చరణ్) జులాయిగా తిరుగుతుంటాడు.
కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ముందు తల లేకుండా దొరికిన శవం ఇన్వెస్టిగేషన్‌ను గౌతమ్ చేస్తాడు. అసలు గౌతమ్ పోలీస్ ఎలా అయ్యాడు? ఆ శవం ఎవరిది? గౌతమ్ కోసం చైత్ర అమెరికా నుంచి ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే? అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘బ్రహ్మవరం పీఎస్ పరిధిలో’కి వెళ్లాల్సిందే.
బ్రహ్మవరం పీఎస్ పరిధిలో సినిమా ఓటీటీ విడుదలతో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. అద్భుతమైన కథాంశం, నటనతో ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలి.


