
ఓటీటీలోకి మరో ఉత్కంఠభరితమైన తెలుగు వెబ్ సిరీస్ రానుంది. ‘అరేబియా కడలి’ అనే ఈ సిరీస్, నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా కథాంశాన్ని పోలి ఉంటుందని తెలుస్తోంది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది.
Key Points
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'అరేబియా కడలి' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్
నాగ చైతన్య 'తండేల్' సినిమా స్టోరీని పోలిన కథాంశం
సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటన
ఆగస్ట్ 8 నుండి తెలుగుతో పాటు ఐదు భాషల్లో ప్రసారం
‘అరేబియా కడలి’ ట్రైలర్ విడుదల
ఓటీటీలోకి మరో తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. శ్రీకాకుళానికి చెందిన జాలర్లు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడం, పాక్ నేవీ వాళ్లను అరెస్ట్ చేయడం అనే కథతో ఈ సిరీస్ వస్తోంది. ఇది వినగానే మీకు ఏదైనా గుర్తుకు వస్తోందా? అవును నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ స్టోరీలాగే అనిపించే అరేబియా కడలి వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో రాబోతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తున్న మరో తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ అరేబియా కడలి. కొన్ని రోజుల కిందట ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆ ఓటీటీ తాజాగా శుక్రవారం (ఆగస్ట్ 1) ట్రైలర్ తీసుకొచ్చింది. ఈ ట్రైలర్ చూడగానే చాలా మందికి తండేల్ మూవీ స్టోరీలాగే అనిపించింది. ఈ సిరీస్ లో సత్యదేవ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
‘తండేల్’ కథాంశం ప్రేరణ
శ్రీకాకుళానికి చెందని జాలర్లు పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అక్కడికి నేవీ వాళ్లకు చిక్కడం, తర్వాత వాళ్లను ఇండియాకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు, హీరో కోసం ఎదురు చూసే హీరోయిన్.. ఇలా సాగిపోయింది ఈ సిరీస్ ట్రైలర్. ఫస్ట్ లుక్ పోస్టర్ సమయంలోనే ఈ స్టోరీపై కాస్త అంచనా వచ్చినా.. ఇప్పుడు ట్రైలర్ తో అదే అని కన్ఫమ్ అయిపోయింది. ఇదే స్టోరీతో వచ్చిన తండేల్ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయింది. మరి ఈ అరేబియా కడలి ఏం చేస్తుందో చూడాలి.
అరేబియా కడలి వెబ్ సిరీస్ ఆగస్ట్ 8 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సిరీస్‌లో ప్రముఖ తెలుగు నటులు సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు మరియు విడుదల తేదీ
‘అరేబియా కడలి’ ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని అవార్డు గ్రహీత, స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి క్రియేట్ చేశాడు. క్రిష్ శిష్యుడైన వర్స్ ఫైవ్ సూర్య కుమార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా ఉంది.
శ్రీనివాసరావు కో క్రియేటర్ గా వ్యవహరించిన ఈ షోను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి (క్రిష్ తండ్రి) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అరేబియా కడలి’లో నాజర్, రఘుబాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, హర్ష్ రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరాం, వంశీ కృష్ణ, రవి వర్మ వంటి బలమైన సహాయక నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మొత్తంగా, ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ ‘తండేల్’ సినిమాకు సమానమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆగష్టు 8వ తేదీన ప్రసారం ప్రారంభం కానుంది.


