
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ తాజా ప్రకటనతో సినీ కార్మికులకు పండగ వాతావరణం. వేతనాల పెంపుతో పాటు, అనేక అలవెన్సులు కూడా పెంచారు. వివరాలు ఇక్కడ చూడండి.
Key Points
టాలీవుడ్ సినీ కార్మికులకు 22.5% వేతన పెంపు!
జూనియర్ ఆర్టిస్టులకు మూడు కేటగిరీల వారీగా వేతనాలు.
ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అలవెన్సులు కూడా పెంచారు.
వేతన పెంపు వివరాలు
టాలీవుడ్ సినీ కార్మికులకు ఫిల్మ్ ఛాంబర్ గుడ్ న్యూస్ చెప్పింది . ఇటీవల చర్చలు సఫలం కావడంతో కార్మికులకు వేతనాల పెంచుతున్నట్లు ప్రకటించింది . నిర్మాతలు , సినీ కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం 22.5 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయించినట్లు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది . ఈనెల 22 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును అమలు చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
జూనియర్ ఆర్టిస్టుల వేతనాలు
సినీ కార్మికుల సంఘాల వారీగా వేతనాలను పెంచుతూ నిర్మాతలకు లేఖలు రాసింది. జూనియర్ ఆర్టిస్టులను మూడు విభాగాలుగా విభజించారు . ఏ కేటగిరిలో రూ.1,420 .. బీ కేటగిరిలో రూ.1,175 .. సీ కేటగిరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఉదయం టిఫిన్ పెట్టకుంటే రూ.70, మధ్యాహ్నం భోజనం ఇవ్వకపోతే రూ.100 అదనంగా ఇవ్వాలని ప్రకటించారు. అలాగే ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌కు రూ.1,470 .. హఫ్ కాల్ షీట్‌కు రూ.735 చెల్లించనున్నారు.
అదనపు అలవెన్సులు
కాల్ షీట్ సమయం 4 గంటలు దాటిన తర్వాత మాత్రమే పూర్తి వేతనం చెల్లిస్తారని జీతాలు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు . పని నిబంధనలకు సంబంధించి ఇతర సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీకి తెలియజేయాలని ఆయన సూచించారు . ఇతర అన్ని వర్కింగ్ కండీషన్స్, అలవెన్సులు 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంతో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీని ఆశ్రయించాలని సూచించారు.


