
📌 Key Points
- తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి.
- విద్యార్థుల సౌలభ్యం కోసం వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చు.
- మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
- హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త! విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా వాట్సాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు మార్చి 14 నుండి ప్రారంభం కానున్నాయి.
హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండిలా
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(BSE) 10వ తరగతి విద్యార్థుల కోసం టీజీ ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ 2026ను విడుదల చేసింది. విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు.. హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. సాంప్రదాయ డౌన్‌లోడ్ పద్ధతితో పాటు, వాట్సాప్ ద్వారా తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు నేరుగా పంపిస్తుంది.
తెలంగాణలోని 2,676 కేంద్రాలలో 5.28 లక్షలకు పైగా విద్యార్థులు మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి. హాల్ టిక్కెట్లను ఇప్పటికే పంపించామని అధికారులు తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు తాజాగా అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in నుండి కూడా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందే విధానం
వాట్సాప్ ద్వారా కూడా యాక్సెస్ ఉంది. విద్యార్థులు 8096958096కు ‘హాయ్’ అని సందేశం పంపాలి. తరువాత “SSC హాల్ టికెట్ మార్చి-2026” అని టెక్స్ట్ పంపాలి. తర్వాత వచ్చే లింక్ మీద క్లిక్ చేసి జిల్లా, మండలం, స్కూల్ పేరును ఎంచుకొని పేరు, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. వెళ్లి ప్రింట్ తీసుకోవాలి. పరీక్షా సమయంలో విద్యార్థులకు సహాయం చేయడానికి బోర్డు 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 040-23230942ను సంప్రదించవచ్చు.
హాల్ టికెట్ల పంపిణీని క్రమబద్ధీకరించడానికి తెలంగాణ సెకండరీ బోర్డు సాంకేతికతతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫారమ్ సమర్పణ సమయంలో తల్లిదండ్రులు నమోదు చేసుకున్న వాట్సాప్ నంబర్లకు హాల్ టిక్కెట్లు పీడీఎఫ్ ఫార్మాట్‌లో వస్తాయి. ప్రతి హాల్ టికెట్‌పై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయడం వల్ల విద్యార్థులు తక్షణమే గూగుల్ మ్యాప్స్ ద్వారా కచ్చితమైన పరీక్షా కేంద్రాని వెళ్తారు. దూరం, ప్రయాణ సమయాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.
పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకోండి
విద్యార్థులు తమ హాల్ టికెట్‌పై ముద్రించిన ప్రతి వివరాలను జాగ్రత్తగా ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి ఇది తప్పనిసరి పత్రం. విద్యార్థి పేరు, రోల్ నంబర్, తండ్రి మరియు తల్లి పేర్లు, పుట్టిన తేదీ, గుర్తింపు గుర్తులు, సబ్జెక్టుల వారీగా పరీక్ష షెడ్యూల్ (తేదీలు మరియు సమయాలు), పరీక్ష కేంద్రం పేరు, పూర్తి చిరునామా, స్థాన ధృవీకరణ కోసం క్యూఆర్ కోడ్ హాల్ టికెట్లో ఉండాలి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాలలో తెలియజేయండి.
ఈ లింక్ క్లిక్ చేసి TG SSC Hall Ticket 2026 డౌన్‌లోడ్ చేసుకోండి.
విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, పరీక్షకు సిద్ధం కావాలని విద్యాశాఖ సూచిస్తుంది. పరీక్షా సమయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని కోరుకుంటున్నాము.


