
తెలంగాణలోని యువత భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక ఘట్టం ఆసన్నమైంది. యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీజీఈటీ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు విద్యార్థుల ఉన్నత విద్యా కలలకు వారధిగా నిలవనున్నాయి.
Key Points
టీజీ సీపీజీఈటీ 2026 పరీక్షలు జూలై 8 నుండి 15 వరకు ప్రతిరోజూ 3 సెషన్లలో జరుగుతాయి.
పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా 90 నిమిషాల వ్యవధితో 100 మార్కులకు నిర్వహిస్తారు.
ప్రశ్నాపత్రంలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో పాటు అనాలజీస్, క్లాసిఫికేషన్ వంటివి ఉంటాయి.
ఉస్మానియా, కాకతీయ సహా పలు యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలకు ఈ పరీక్ష కీలకం.
టీజీ సీపీజీఈటీ 2026: ముఖ్య తేదీలు
తెలంగాణలోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) ప్రవేశాల కోసం నిర్వహించే.. టీజీ సీపీజీఈటీ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. కన్వీనర్ రాజేందర్ విడుదల చేశారు. జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రతీ రోజూ మూడు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల తేదీలు, సెషన్ల వారీ వివరాలు cpget.tgche.ac.in, www.kakatiya.ac.in లో చూడవచ్చు.
టీజీ సీపీగెట్‌లో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ప్రవేశాలు పొందవచ్చు.
అన్ని సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలు 90 నిమిషాల వ్యవధితో ఉంటాయి. ప్రశ్నాపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ (మల్టీపుల్ ఛాయిస్) రకం ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షా విధానం: పూర్తి వివరాలు
ప్రవేశ పరీక్ష లో సాధారణ బహుళైచ్ఛిక ప్రశ్నలతో పాటు, analogies, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్ ఒక పరిశోధనా అధ్యయనం / ప్రయోగం / సైద్ధాంతిక దృక్కోణం అవగాహన మొదలైన 3 లేదా 4 రకాల ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు బహుళ సమాధానాలతో ఉంటాయి. ఈ ప్రశ్నలు కేవలం ప్రవేశ పరీక్ష సిలబస్ నుండి మాత్రమే రూపొందిస్తారు.
ఎం.ఎస్.సి. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీలో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష నమూనా విషయానికొస్తే.. అభ్యర్థులు BCESFSG&M అనే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్షలో పార్ట్-ఎ (రసాయన శాస్త్రం, 40 మార్కులకు), పార్ట్-బి (బి.ఎస్.సి. స్థాయిలో ఐచ్ఛిక సబ్జెక్టులైన భౌతికశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జన్యుశాస్త్రం, సూక్ష్మజీవశాస్త్రం, జీవరసాయన శాస్త్రం లలో ఒక ఐచ్ఛిక సబ్జెక్టు) 60 మార్కులకు ఉంటాయి.
యూనివర్సిటీలు, కోర్సుల వివరాలు
ఎం.ఎస్.సి. బయో- టెక్నాలజీ లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నమూనా చూసుకుంటే.. ఇందులో పార్ట్-ఎ (రసాయన శాస్త్రం, 40 మార్కులకు), పార్ట్-బి (బయోటెక్నాలజీ – 60 మార్కులు) ఉంటాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
ఈ పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, అభ్యర్థులు తమ సన్నద్ధతను మరింత పెంచుకుని, పరీక్షా విధానంపై పూర్తి అవగాహనతో విజయం సాధించాలని ఆశిస్తున్నాం. ఇది వారి ఉన్నత విద్యా భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది.



Amitabh Bachchan Admits Mistake After Racism Row Over France Football Team Tweet