|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డీఈఈసెట్ 2026: దరఖాస్తుకు ఇక మూడు రోజులే గడువు! పరీక్ష తేదీలు ఖరారు!!

Published: 11-04-2026, 1:05 PM
డీఈఈసెట్ 2026: దరఖాస్తుకు ఇక మూడు రోజులే గడువు! పరీక్ష తేదీలు ఖరారు!!
  • డీఈఈసెట్ 2026 దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ.
  • జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీఎస్‌ అభ్యర్థులకు రూ.450.
  • దరఖాస్తులో తప్పులుంటే ఏప్రిల్ 17, 18 తేదీల్లో సరి చేసుకోవచ్చు.
  • మే 21, 22 తేదీల్లో డీఈఈసెట్ 2026 ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.

తెలంగాణ రాష్ట్రంలోని డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం డీఈఈసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. పరీక్ష మే 21, 22 తేదీల్లో జరుగుతుంది.

డీఈఈసెట్ 2026: ముఖ్యమైన తేదీలు

రాష్ట్రంలోని డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ( డీఈఈసెట్‌ 2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు చివరి వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

డీఈఈసెట్‌ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీఎస్‌ అభ్యర్థులు రూ.450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకున్న వారు వివరాల్లో తప్పులుంటే ఈనెల 17, 18 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు వివరాలు

టీచర్‌ కొలువుల్లో స్థిరపడాలని భావించే వారు ఈ కోర్సులు చేసుకోవచ్చు. ఈ కోర్సులు చదివేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలో…. క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ర్యాంకుల ఆధారంగా…. రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు.

టీజీ డీఈఈసెట్‌ 2026 ప్రవేశ పరీక్షలు మే 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. మొత్తం వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. ఈ నోటిఫికేషన్ తో పాటు ఇతర సందేహాలు ఏమైనా ఉంటే 8317567404 నెంబర్ ను సంప్రదించవచ్చు. లేదా [email protected] కు మెయిల్ చేయవచ్చు.

పరీక్ష విధానం మరియు ఇతర వివరాలు

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

డీఈఈసెట్ 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పరీక్షలో మంచి ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలని కోరుతున్నాము. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.