|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

TG EAPCET 2026 కౌన్సెలింగ్: విద్యార్థుల భవితవ్యంపై కీలక ప్రకటన! షెడ్యూల్, తేదీలు ఇవే!

Published: 08-06-2026, 5:00 PM
TG EAPCET 2026 కౌన్సెలింగ్: విద్యార్థుల భవితవ్యంపై కీలక ప్రకటన! షెడ్యూల్, తేదీలు ఇవే!
  • టీజీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
  • జూన్ 19 నుండి మెుదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
  • ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు.
  • ఆగస్టు చివరి వారంలో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల అవుతాయి.

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనుంది. విద్యార్థులు ముఖ్యమైన తేదీలను గమనించి సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి.

కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) 2026 కౌన్సెలింగ్ అధికారిక షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియను వేగంగా ముగించి, సకాలంలో అకడమిక్ ఇయర్ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

మూడు విడతల్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు. జూన్ 19వ తేదీ నుంచి మెుదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మెుదలవుతుంది. జూన్ 28వ తేదీదాకా స్లాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండనుంది. జూన్ 25 నుంచి జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పిస్తారు. జూలై 4వ తేదీన మాక్ సీట్ అలకేషన్ నిర్వహిస్తారు. జూలై 10వ తేదీన మెుదటి విడత సీట్లను ప్రకటిస్తారు. జూలై 10వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

మూడు విడతల ప్రక్రియ వివరాలు

మొదటి విడతలో సీటు రాని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కోసం జూలై 2026 లోనే రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి జూలై 31న మూడో విడత కౌన్సెలింగ్ మెుదలవుతుంది. ఈ మూడు విడతల ప్రక్రియ ముగిసిన అనంతరం, ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆగస్టు చివరి వారంలో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తారు.

స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడు?

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సుగమం కానుంది. సకాలంలో అకడమిక్ ఇయర్ ప్రారంభించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులు అన్ని వివరాలను సరిచూసుకొని ప్రవేశ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.