|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది! షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు: విద్యాశాఖ ప్రకటన!

Published: 09-04-2026, 11:05 AM
ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది! షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు: విద్యాశాఖ ప్రకటన!
  • ఇంటర్ ఫలితాల విడుదలపై తెలంగాణ విద్యాశాఖ ప్రకటన
  • ఫలితాల ఆలస్యంపై వదంతులను ఖండించిన విద్యాశాఖ
  • నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఫలితాల విడుదల
  • ఏప్రిల్ 3 లేదా 4వ వారంలో ఫలితాలు వచ్చే అవకాశం

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే వార్తలను ఖండించింది. ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల అవుతాయని తెలిపింది.

ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న వార్తలను ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలని… అందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఇంటర్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని పేర్కొంది.

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం , ఇతర అంశాలను బట్టి ఫలితాల విడుదల అయ్యే తేదీలు ప్రతి ఏటా మారుతుంటాయని తెలంగాణ విద్యాశాఖ వివరించింది. అదే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. మూల్యాంకన సమయాన్ని బట్టి… ఫలితాల విడుదల తేదీపై ప్రకటన చేస్తారని పేర్కొంది.

వదంతులను ఖండించిన విద్యాశాఖ

ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. సామాజిక మాధ్యమాలలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

జ: ఏప్రిల్ మూడవ వారం లేదా 4వ వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అధికారిక తేదీని విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుంది.

జ: లేదు. ఫలితాల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

విద్యార్థులకు విద్యాశాఖ సూచన

జ: విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్(tgbie.cgg.gov.inకు) లో వారి ఫలితాలను చూసుకోవచ్చు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

తెలంగాణ విద్యాశాఖ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని విజ్ఞప్తి. ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.