
📌 Key Points
- టీజీ సెట్ 2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 15న ప్రారంభం.
- ఏప్రిల్ 19 నాటికి అన్ని సబ్జెక్టుల వెరిఫికేషన్ పూర్తి కానుంది.
- అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు ఈ పరీక్ష అర్హత.
- మే నెలలో సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
తెలంగాణ సెట్-2025 ఫలితాలు విడుదలైన తర్వాత, తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 15 నుంచి వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
టీజీ సెట్ 2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ వివరాలు
గత నెలలోనే తెలంగాణ సెట్ – 2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అయితే తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఏప్రిల్ 15వ తేదీతో టీజీ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 19వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టుల వెరిఫికేషన్ పూర్తవుతుందని ప్రకటించారు.
టీజీ సెట్ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశాలు
జ: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పీహెచ్డీ అడ్మిషన్లకు కూడా పరిగణనలోకి తీసుకుంచారు.
జ: టీజీ సెట్ పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు.
త్వరలో రానున్న సెట్ నోటిఫికేషన్
జ: మే నెలలో సెట్ నోటిఫికేషన్ రానుంది. ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఇటీవలే ప్రకటించారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
టీజీ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో, అభ్యర్థులు తమ భవిష్యత్తు ప్రణాళికలకు సిద్ధం కావడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. త్వరలో రాబోయే నోటిఫికేషన్ కోసం ఎదురుచూడండి.


