|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తలైవా పుట్టినరోజు.. ఇంట్రెస్టింగ్ ట్వీట్‌తో విషెస్ చెప్పిన ప్రధాని

Published: 11-12-2025, 11:07 PM
తలైవా పుట్టినరోజు.. ఇంట్రెస్టింగ్ ట్వీట్‌తో విషెస్ చెప్పిన ప్రధాని
  • ప్రధాని మోడీ రజినీకాంత్‌కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
  • రజినీకాంత్ నటన తరం తరాల ప్రేక్షకులను ఆకర్షించిందని మోడీ ప్రశంసించారు.
  • ఈ సంవత్సరం రజినీకాంత్ సినీ ప్రపంచంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
  • 75 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ ఎనర్జీ, నటన అభిమానులను అలరిస్తున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రజినీ నటన, సినీ ప్రస్థానాన్ని ప్రశంసించిన మోడీ, ఆయన ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న రజినీకి ఇది ముఖ్యమైన సంవత్సరం.

మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు

త‌మిళ‌స్టార్ హీరో ర‌జినీకాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ఎక్స్ వేధిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. తిరు ర‌జినీకాంత్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని మోడీ పేర్కొన్నారు. ఆయ‌న న‌ట‌న త‌ర‌త‌రాల‌ను ఆక‌ర్షించింద‌ని ప్ర‌శంసించారు. విస్తృత‌మైన ప్ర‌శంస‌ల‌ను సంపాదించింద‌ని అన్నారు. ర‌జినీకాంత్ ర‌చ‌న‌లు విభిన్న‌మైన పాత్ర‌ల‌ను, శైలుల‌ను క‌లిగి ఉన్నాయ‌ని స్థిరంగా ప్ర‌మాణాల‌ను నిర్దేశిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

ర‌జినీకాంత్ చ‌ల‌నచిత్ర ప్ర‌పంచంలో 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నందుకు ఈ ఏడాది ముఖ్య‌మైన‌ద‌ని అన్నారు. ఆయ‌న సుదీర్ఘ‌కాలం ఆరోగ్యంగా జీవించాల‌ని ప్రార్థిస్తున్న‌ట్టు తెలిపారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ నేడు 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రజినీ తమిళ హీరో అయినప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. రోబో సినిమాతో దేశవ్యాప్తంగా రజినీకాంత్ స్టార్ గా మారారు. అంతే కాకుండా 75ఏళ్ల వయసు వచ్చినా జోష్ ఏమాత్రం తగ్గకుండా తన నటనతో ఎనర్జీతో అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు.

రజినీకాంత్ సినీ ప్రస్థానం

75 ఏళ్ల వయసులోనూ తగ్గని జోష్

ప్రధాని మోడీ శుభాకాంక్షలతో రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి. 50 ఏళ్ల సినీ ప్రస్థానం, 75 ఏళ్ల వయసులోనూ తగ్గని ఆయన జోష్ అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. రజినీకి దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.