|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు: సినిమాలను వదిలేస్తున్నది ఎవరి కోసం?

Published: 28-12-2025, 1:05 AM
దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు: సినిమాలను వదిలేస్తున్నది ఎవరి కోసం?
  • ‘జననాయగన్’ ఆడియో రిలీజ్ వేడుకలో విజయ్ సంచలన ప్రసంగం.
  • అభిమానుల కోసం రాబోయే 30-33 ఏళ్లు నిలబడతానని విజయ్ ప్రకటన.
  • అజిత్, ప్రకాష్ రాజ్, అనిరుధ్ వంటి వారిపై ఆసక్తికర వ్యాఖ్యలు.
  • బలమైన శత్రువే మనిషిని బలంగా మారుస్తాడని విజయ్ బోధన.

దళపతి విజయ్ ‘జననాయగన్’ ఆడియో రిలీజ్ వేడుకలో సంచలన ప్రసంగం చేశారు. అభిమానులను ఉద్దేశించి “ఈ విజయ్, అభిమానుల కోసం సినిమాను వదిలేస్తున్నాడు” అని ప్రకటించారు. ఈ షాకింగ్ వ్యాఖ్యలు, దాని వెనుక ఉన్న ఆసక్తికర వివరాలను ఈ కథనంలో చూడండి.

‘జననాయగన్’ ఈవెంట్‌లో విజయ్ స్పీచ్ హైలైట్స్

సౌత్ స్టార్ హీరో  విజయ్ సంచలన ప్రకటన చేశారు. జననాయగన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఆయన ప్రసంగం అందరిని ఆకర్శించింది.  తనదైన శైలిలో అభిమానులను చూస్తూ.. ‘అయ్యా, రాజా… నా గుండెల్లో నివసించే స్నేహితులకు, స్నేహితురాళ్లకు నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కొన్ని సినిమాల పేర్లు వింటే మలేషియానే గుర్తొస్తుందిి, ముందుగా మన స్నేహితుడు నటించిన ‘బిల్లా’ అని విజయ్ అనగానే..  స్టేడియం ఈలలతో దద్దరిల్లింది. అజిత్ సినిమా గురించి విజయ్ మాట్లాదటంతో. అభిమానులు దిల్ ఖుష్ అయ్యారు.  ఆ తర్వాత తన సినిమాలైన ‘కావలన్’, ‘కురువి’ గురించి విజయ్ మాట్లాడారు.

విజయ్ మాట్లాడుతూ… ” శ్రీలంక తర్వాత మలేషియాలోనే ఎక్కువ మంది తమిళ ప్రజలు ఉన్నారు. నాకు ఏదైనా అయితే థియేటర్లలో నిలబడతారు. వాళ్ల కోసం రాబోయే 30-33 ఏళ్లు నేను నిలబడతాను. ఈ విజయ్, అభిమానుల కోసం సినిమాను వదిలేస్తున్నాడు. నేను ఒక చిన్న  ఇల్లు కట్టుకోవాలనే ఆశతో సినిమాలోకి వచ్చాను. కానీ మీరు నన్ను ప్యాలెస్‌లో కూర్చోబెట్టారు. వరదలో కొట్టుకుపోతున్న వాడికి మీరు పడవ ఇస్తే, ఎడారిలో మీరు దాహంతో ఉన్నప్పుడు అది ఒంటెలా మీకు సహాయం చేస్తుంది. నేను అదే చేయబోతున్నాను అని అన్నారు.

అభిమానుల కోసం సినిమాలను వదిలేస్తున్నా: దళపతి

ఈ సినిమాలో తనతో పనిచేసిన వారి గురించి విజయ్ మాట్లాడుతూ, మమిత కేవలం ‘డ్యూడ్’ మాత్రమే కాదు, ఈ సినిమా తర్వాత ప్రతి కుటుంబంలో ఒక చెల్లిగా నిలిచిపోతుంది. దర్శకుడు హెచ్. వినోద్ సమాజంపై ప్రభావం ఉన్న దర్శకుడు. మేమిద్దరం ముందే కలిసి పనిచేయాల్సింది. దానికోసం చర్చలు కూడా జరిగాయి. అప్పుడు కుదరలేదు. అదృష్టవశాత్తూ ఈ సినిమాతో కలిశాం.

విజయ్ మాట్లాడుతూ.. ‘’సాధారణంగా హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. కానీ నాకు, ప్రకాష్ రాజ్ గారికి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ‘గిల్లి’తో మొదలై ఇప్పటికీ అది కొనసాగుతోంది. అనిరుధ్ ఒక మ్యూజికల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్. అక్కడ అన్‌లిమిటెడ్‌గా మ్యూజిక్ దొరుకుతుంది. అతను మనల్ని ఎప్పుడూ నిరాశపరచడు. నా సినిమాలకే కాదు, ఏ నటుడి సినిమాకి సంగీతం ఇచ్చినా అది హిట్టే.

అజిత్ నుండి అనిరుధ్ వరకు… విజయ్ కామెంట్స్

జీవితంలో గెలవడానికి మంచి స్నేహితులు అవసరం లేదు. బలమైన శత్రువు కావాలి. బలమైన శత్రువే మిమ్మల్ని బలంగా మారుస్తాడు. నేను మొదటి రోజు నుంచే విమర్శలను ఎదుర్కొంటున్నాను. కానీ నా అభిమానులు 33 ఏళ్లుగా నాతోనే నిలబడ్డారు. నా కోసం నిలబడిన వాళ్ల కోసం ఇప్పుడు నేను నిలబడబోతున్నాను అని అన్నారు.

ఆ తర్వాత విజయ్‌ కి  ఒక ప్రశ్న ఎదురయ్యింది.  ‘సినిమాలో మీరు వదిలి వెళ్తున్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు?’ అని యాంకర్లు అడగ్గా, ‘ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో ప్రజలకు తెలుసు, వాళ్లే చూసుకుంటారు’ అని విజయ్ సమాధానమిచ్చారు.

మొత్తంగా, విజయ్ తన ప్రసంగం ద్వారా అభిమానులతో తన బంధాన్ని, భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టం చేశారు. ఈ ప్రకటన కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది, ఆయన నిజమైన ఉద్దేశ్యంపై అనేక ఊహాగానాలకు తెరలేపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.