
📌 Key Points
- తమన్ దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీతం అందించేందుకు ఆసక్తి.
- ‘ఎల్లమ్మ’ పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందని తమన్ ధీమా వ్యక్తం చేశారు.
- దేవిశ్రీ అన్నతో ఎలాంటి విబేధాలు లేవని తమన్ స్పష్టం చేశారు.
- దిల్ రాజుతో మాట్లాడి పాటలకు అవకాశం అడిగినట్లు తమన్ వెల్లడి.
టాలీవుడ్ మ్యూజిక్ ప్రపంచంలో సంచలనం! తమన్, దేవిశ్రీ ప్రసాద్‌ల మధ్య పోటీ అనే రూమర్లకు చెక్ పెడుతూ, దేవిశ్రీ సినిమాకు తాను పనిచేస్తానని తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. ఈ మాస్ అప్డేట్ ఫ్యాన్స్‌లో అంచనాలను ఆకాశానికి చేర్చింది!
దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ పై తమన్ ప్రశంసలు
Thaman : టాలీవుడ్ లో కొన్నాళ్లపాటు దేవిశ్రీప్రసాద్ ఆధిపత్యం సాగితే గత కొన్నాళ్లుగా తమన్ అదరగొడుతున్నాడు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరికీ పోటీ, ఇద్దరి మధ్య విబేధాలు అని కూడా వచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ అవేమి లేవని పలుమార్లు ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. నేడు తమన్ దేవిశ్రీ ప్రసాద్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
పోటీ కాదు.. మాది స్నేహం!
నేడు తమన్ తన మ్యూజికల్ టూర్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. ఎల్లమ్మ లాంటి సినిమాని దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకున్నందుకు హ్యాట్సాఫ్. నాకు ఆ కథ మొత్తం తెలుసు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ సినిమాకు దేవి అన్న ప్రాణం పెడుతున్నాడు. నేను దిల్ రాజు గారితో మాట్లాడినప్పుడు పాటలు చేయాల్సి వస్తే ఆ సినిమాను నేను చేస్తాను అని అడిగాను. నాది, నేనే అంటే సరిపోదు. అందరితో కలిసి పనిచేయాలి. అందుకే దేవిశ్రీ సినిమాకు పనిచేస్తానని అడిగినట్లు తెలిపారు.
‘ఎల్లమ్మ’ సినిమాకు తమన్ సంగీతం?
దీంతో మరోసారి తనకు – దేవిశ్రీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. మరి ఎల్లమ్మ సినిమాకు తమన్ వర్క్ చేస్తాడా చూడాలి. అలాగే.. నేను గతంలో బాయ్స్ సినిమాలో హీరోగా చేశాను. మళ్ళీ చేయను. దేవి అన్న ముందు సంగీతం చేసి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఇకపై నా జీవితం సంగీతానికే అని అన్నారు.
ఈ ఇద్దరు మ్యూజిక్ దిగ్గజాల కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. ‘ఎల్లమ్మ’ సినిమాపై తమన్ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


