|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కాపీ పాటలపై తమన్ సంచలన నిజాలు! త్రివిక్రమ్‌తో గొడవ జరిగిందా?

Published: 21-03-2026, 3:35 AM
షాకింగ్: కాపీ పాటలపై తమన్ సంచలన నిజాలు! త్రివిక్రమ్‌తో గొడవ జరిగిందా?
  • తమన్ కాపీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు: ‘నేను అందుకే దొరికిపోతున్నా’
  • త్రివిక్రమ్‌తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన తమన్: త్వరలో మళ్ళీ కలిసి పనిచేస్తాం
  • కొత్త టీమ్‌తో త్రివిక్రమ్ సినిమా చేయడం వల్లే అవకాశం రాలేదన్న తమన్
  • సోషల్ మీడియా లేకపోవడం వల్లే అప్పట్లో చాలామంది కాపీ కొట్టినా దొరకలేదన్న తమన్

సంగీత దర్శకుడు తమన్ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాపీ ఆరోపణలపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, త్రివిక్రమ్‌తో విభేదాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

కాపీ ఆరోపణలపై తమన్ క్లారిటీ

సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ బాయ్స్ మినహాయిస్తే మరే సినిమాలోనూ నటించలేదు. ఆ తర్వాత తన పూర్తి శ్రద్ధను సంగీతంపై పెట్టాడు. ఇప్పటివరకు చాలా సినిమాలకు సంగీతం అందించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. తమన్ ఎన్నో గొప్ప పాటలను అందించి, ఎన్నో చిత్రాలకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఒక విషయంలో మాత్రం ఆయనపై చాలామంది సెటైర్లు వేస్తుంటారు.

త్రివిక్రమ్‌తో సినిమాపై అసలు నిజం

అది ఏమిటనుకుంటున్నారా? ఈ సంగీత దర్శకుడు ఏదైనా పాట కంపోజ్ చేశాడంటే అది కాపీ అంటూ అనేకమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. ఇదే విషయం గురించి ఆయన పలు సందర్భాలలో మాట్లాడారు. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో “మీ దృష్టిలో కాపీకి, ఇన్స్పిరేషన్ కి తేడా ఏమిటి?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి తమన్… “నాకు కాపీ చేయడం సరిగ్గా రావడం లేదు, అందుకే దొరికిపోతున్నాను. కొంతమంది చాలా తెలివిగా కాపీ కొడతారు, వారు అస్సలు దొరకరు. నాకు అంత తెలివిగా చేయడం రాదు, అందుకే దొరికిపోతున్నాను.”

సోషల్ మీడియాపై తమన్ కామెంట్స్

అప్పట్లో చాలామంది కాపీ కొట్టేవారు, కానీ ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం ఇంత స్థాయిలో లేకపోవడం వల్ల వారు దొరకలేదని ఆయన చెప్పాడు. ఇదే ఇంటర్వ్యూలో “గత కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ గారి సినిమాలకు మీరు వరుసగా మ్యూజిక్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’కి మీరు సంగీతం అందించడం లేదు. మీ మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి “త్రివిక్రమ్, నేను రోజు కలుస్తుంటాం. మా మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉంది. కానీ ఆయన ఈ సినిమాను అంతా కొత్త టీంతో చేయాలి అనుకున్నారు. దాంతో నేను కూడా తప్పుకున్నాను. మళ్లీ నెక్స్ట్ మూవీతో మేమిద్దరం కలిసి పనిచేస్తాం” అని క్లారిటీ ఇచ్చాడు.

తమన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.