|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమన్ షాకింగ్ రిప్లై: “పిచ్చనా పకోడా” అంటూ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Published: 29-12-2025, 10:24 PM
తమన్ షాకింగ్ రిప్లై: "పిచ్చనా పకోడా" అంటూ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
  • ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
  • ‘రాజాసాబ్ 2.0’ ట్రైలర్ R.R. అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై తమన్ స్పందించారు.
  • ‘ఆ మ్యూజిక్ ఏంట్రా మెంటల్ నా కొ*కా’ అని ట్వీట్ చేసిన నెటిజన్‌కు ‘థ్యాంక్స్ రా పిచ్చ నా పకోడా’ అంటూ తమన్ రిప్లై ఇచ్చారు.
  • సోషల్ మీడియాలో తమన్ ఇచ్చిన కౌంటర్, అభిమానుల స్పందన ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

సంగీత దర్శకుడు తమన్ ‘ది రాజాసాబ్’ సినిమా మ్యూజిక్ విషయంలో నెటిజన్‌కు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. “ఆ మ్యూజిక్ ఏంట్రా” అని ట్వీట్ చేసిన అభిమానికి “థ్యాంక్స్ రా పిచ్చ నా పకోడా” అంటూ తమన్ ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.

తమన్ వర్సెస్ నెటిజన్: అసలేం జరిగింది?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూనే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, ఓజీ, తెలుగు కదా, అఖండ-2 వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించారు. అయితే ఇందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కగా.. మరికొన్ని బాగానే అరించాయి. ప్రస్తుతం తమన్, ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’(The Raja Saab) కు సంగీతం అందిస్తున్నారు. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ చిత్రంగా రాబోతుంది. దీనిని మారుతి తెరకెక్కిస్తు్న్నారు. భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఇప్పటికే ఇందులోంచి వచ్చిన రెండు పాటలతో పాటు ఓ ట్రైలర్ విడుదల కాగా.. మంచి రెస్పా్న్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, రాజాసాబ్ 2.0 పేరుతో మరో ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి తమన్ ఇచ్చిన ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ మ్యూజిక్‌ని మెచ్చుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ అభిమానికి, తమన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘ట్రైలర్ కె ర్యాంప్ అయ్యా మారుతి. ఆ మ్యూజిక్ ఏంట్రా మెంటల్ నా కొ*కా’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దానికి తమన్ స్పందిస్తూ.. “థ్యాంక్స్ రా పిచ్చ నా పకోడా” అని రిప్లై ఇచ్చారు. ‘ఏం కొట్టావ్ అన్నా అసలు. మా ఫ్యాన్స్ తరపున సారీ. ఇప్పటి వరకూ నిన్ను చాలా మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం’ అని మరో అభిమాని పోస్ట్ పెట్టగా.. “అన్నది తమ్ముళ్లేగా.. పర్లేదులే” అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ది రాజాసాబ్’ ట్రైలర్.. మ్యూజిక్ హైలైట్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు

తమన్ ఇచ్చిన ఈ అనూహ్య కౌంటర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తన అభిమానులతో తమన్ ఎంత స్వేచ్ఛగా ఉంటారో మరోసారి రుజువైంది. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.