|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thamma Song: పేరుకే హారర్ సినిమా.. కానీ అన్నీ ఐటమ్ సాంగ్సే

Published: 14-10-2025, 4:12 AM
Thamma Song: పేరుకే హారర్ సినిమా.. కానీ అన్నీ ఐటమ్ సాంగ్సే

‘థామా’ సినిమా అక్టోబరు 21న విడుదల కానుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పేరుకు హారర్ ఎలిమెంట్స్ ఉన్నా, ప్రధానంగా ఐటమ్ సాంగ్స్‌తో అలరించనున్నట్లు తెలుస్తోంది. మలైకా అరోరా, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్‌లు ఈ గీతాల్లో సందడి చేశారు.

Key Points

1

రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న హిందీ సినిమా 'థామా' అక్టోబరు 21న రిలీజ్.

2

'స్త్రీ' యూనివర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరో.

4

గతంలో నోరా ఫతేహి, రష్మిక కూడా ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

‘థామా’ సినిమా విడుదల వివరాలు

రష్మిక హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ హిందీ సినిమా ‘థామా’. ‘స్త్రీ’ యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త మూవీ ఇది. అక్టోబరు 21న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో పాటలు మాత్రం ప్రతిదీ ఐటమ్ సాంగే అనిపిస్తుంది. తాజాగా రిలీజైన సాంగ్‌లో అయితే 51 ఏళ్ల బ్యూటీ అదిరిపోయే స్టెప్పులేయడం విశేషం.

ఐటమ్ సాంగ్స్‌తో అలరిస్తున్న హీరోయిన్స్

‘థామా’ నుంచి తాజాగా ‘పా*యిజన్ బేబీ’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కూడా పార్టీ నేపథ్యంగా సాగే గీతం అర్థమవుతోంది. తొలుత మలైకా అరోరా గ్లామరస్‌గా కనిపిస్తూ స్టెప్పులేయగా, చివరలో రష్మిక కూడా మలైకతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇదే కాదు గతంలో ‘దిల్‌బర్’ అంటూ సాగే మరో పాట రిలీజ్ చేశారు. ఇందులో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. ఇది ఐటమ్ సాంగ్. అంతకుముందు రష్మిక పాట కూడా చూడటానికి ఐటమ్ సాంగ్‌లానే అనిపిస్తుంది. చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు ఐటమ్ గీతాలు చాలానే ఉన్నాయి!

మలైకా అరోరా ‘పా*యిజన్ బేబీ’ డాన్స్

‘థామా’ సినిమా కేవలం కామెడీ, హారర్ అంశాలతోనే కాకుండా, ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది. రష్మిక సహా పలువురు తారల అదిరిపోయే డ్యాన్స్‌లు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.