|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thamma Trailer : రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ‘థామా’ తెలుగు ట్రైలర్..

Published: 29-09-2025, 11:48 AM
Thamma Trailer : రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ‘థామా’ తెలుగు ట్రైలర్..

రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన బాలీవుడ్ హారర్ కామెడీ చిత్రం ‘థామా’. ఈ పాన్ ఇండియా సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

Key Points

1

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో 'థామా' సినిమా.

2

హారర్ కామెడీ జోనర్‌లో అక్టోబర్ 21న విడుదల కానుంది.

4

హీరోకి బేతాళుడి లక్షణాలు రావడంతో పాటు హీరోయిన్ బేతాళ గ్రూప్‌కి చెందిన కథాంశం.

‘థామా’ విడుదల తేదీ, నటీనటులు

Thamma Trailer : ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన హారర్ కామెడీ బాలీవుడ్ సినిమా థామా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా థామా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తుండటంతో తెలుగులో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో థామా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.(Thamma Trailer)

రష్మిక మందన్న థామా తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి..

తెలుగులో ‘థామా’ ట్రైలర్ విడుదల

సినిమా కథాంశం, ఆసక్తికర విశేషాలు

ఈ ట్రైలర్ చూస్తుంటే.. హీరో ఓ పాత బంగ్లాకి వెళ్తే అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించి ఉన్న బేతాళుడు కనిపిస్తాడు. అనుకోకుండా అతని లక్షణాలు, పవర్స్ హీరోకి వస్తాయి. హీరోయిన్ ఇది పసిగడుతుంది. హీరోయిన్ కూడా అదే బేతాళ గ్రూప్ కి చెందిందని, మరి ఆ బేతాళుడిని ఎలా అంతమొందించారు, హీరో ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో హారర్ కామెడీగా సాగనున్నట్టు తెలుస్తుంది.

‘థామా’ ట్రైలర్ చూస్తుంటే సినిమా హారర్, కామెడీ, సస్పెన్స్‌తో నిండి ఉంటుందని అర్థమవుతోంది. అక్టోబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులని అలరించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.