|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తమ్ముడు’ సినిమా.. ట్వీట్‌తో బిగ్ షాక్ ఇచ్చిన మూవీ టీమ్

Published: 28-06-2025, 6:43 AM
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తమ్ముడు’ సినిమా.. ట్వీట్‌తో బిగ్ షాక్ ఇచ్చిన మూవీ టీమ్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ లభించింది. చిత్ర బృందం ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

Key Points

1

నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

2

సినిమాకు ‘A’ సర్టిఫికెట్ లభించింది.

4

పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో సమానంగా ఉండటంతో అంచనాలు పెరిగాయి.

‘తమ్ముడు’ సినిమా సెన్సార్ పూర్తి

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) గత ఏడాది ‘రాబిన్‌హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నితిన్ ‘తమ్ముడు’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధపడుతున్నారు. ఇక ఈ సినిమాకు శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా(Saurabh Sachdeva) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థ్రియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

దీంతో.. జోరు పెంచిన చిత్ర బృందం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. అలాగే వరుస అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హిట్ మూవీ టైటిల్‌తో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘తమ్ముడు’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘‘A’’ సర్టిఫికెట్ వచ్చినట్లు వెల్లడించారు. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లకు మాత్రమే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఉంటుందన్న మాట. దీంతో ఈ విషయం తెలుసుకున్న నితిన్ అభిమానులు షాక్ అవుతున్నారు.

‘A’ సర్టిఫికెట్‌తో షాక్

జూలై 4న గ్రాండ్ రిలీజ్

‘తమ్ముడు’ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, జూలై 4న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.