|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thammudu X Review: ‘తమ్ముడు’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..

Published: 03-07-2025, 11:14 PM
Thammudu X Review: ‘తమ్ముడు’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా జులై 4న విడుదలైంది. సోషల్ మీడియాలో సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమాను ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

Key Points

1

నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

2

యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి.

4

సినిమా టెక్నికల్ విలువలు బాగున్నాయని కొందరు అంటున్నారు.

ప్రేక్షకుల స్పందనలు

శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నరు.

తమ్ముడు కథేంటి? ఎలా ఉంది? నితిన్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.

సినిమా ప్రతిబింబం

ఎక్స్‌లో తమ్ముడు చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది.. బాగోలేదని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.

బలాలు మరియు బలహీనతలు

బిలో యావరేజ్‌ సినిమా ఇది. రెండు ఫైట్‌ సీక్వెన్స్‌ మినహా సెకండాఫ్‌ అంతా బోరింగ్‌గా సాగుతుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాలేదు. యాక్షన్‌ కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే ప్లస్‌ అయింది. వేణు శ్రీరామ్‌ డిసప్పాయింట్ చేశాడు. టెక్నికల్‌గా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో సక్సెస్‌ అయ్యాడు కానీ.. సరైన కథనే రాసుకోలేకపోయాడు. టీం పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ అది ప్రేక్షకుడిపై ప్రభావం చూపలేకపోయింది’అని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు.

మొత్తంమీద, ‘తమ్ముడు’ సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కథలోని బలహీనతలు సినిమా విజయానికి అడ్డుగా ఉండొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.