|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thanuja : కళ్యాణ్ పడాల పై మనసులో మాట బయటపెట్టిన తనూజ, అసలు విషయం వెల్లడించిన బిగ్ బాస్ రన్నర్

Published: 26-12-2025, 10:21 AM
Thanuja : కళ్యాణ్ పడాల పై మనసులో మాట బయటపెట్టిన తనూజ, అసలు విషయం వెల్లడించిన బిగ్ బాస్ రన్నర్
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలిచారు.
  • బిగ్ బాస్ హౌస్‌లో తనూజ, కళ్యాణ్ మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడింది.
  • వారిద్దరి రిలేషన్‌పై ప్రేక్షకుల, మీడియాలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
  • కళ్యాణ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తనూజ సోషల్ మీడియా లైవ్‌లో స్పష్టం చేసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసిన తర్వాత, విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నర్ తనూజ మధ్య ఉన్న రిలేషన్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా తనూజ సోషల్ మీడియా లైవ్ సెషన్‌లో కళ్యాణ్ గురించి తన మనసులో మాట బయటపెట్టింది. అసలు ఆమె ఏం చెప్పింది? తెలుసుకుందాం.

బిగ్ బాస్ 9: కళ్యాణ్ విజయం, తనూజ ఫేవరెట్‌గా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీసెంట్ గా ముగిసింది. ఈసీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. బిగ్ బాస్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సీజన్ 9 విన్నర్ గా సామన్యుల కోటా నుంచి హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల నిలిచాడు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ మాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఒక సాధారణ వ్యక్తిగా షోలోకి వచ్చి, ప్రేక్షకుల్లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే కాకుండా, చివరకు ట్రోఫీని అందుకోవడం అసాధారణమైన విషయం అని చెప్పాలి. ఈ విజయం కళ్యాణ్ పడాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఇదిలా ఉండగా, బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్‌గా సీరియల్ నటి తనూజ పేరు బలంగా వినిపించింది. షో ముందుకు సాగుతున్న కొద్దీ, ఆమెనే విన్నర్ గా నిలుస్తుందని చాలా మంది ఆడియన్స్ నమ్మకంగా ఉన్నారు. చివరి నిమిషం వరకూ.. ఆమె విన్నర్ అని ఫిక్స్ అయి ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ చివరకు అనూహ్యంగా కళ్యాణ్ పడాల టాప్‌లోకి వచ్చి విన్నర్‌గా నిలవడం షోలో కీలక మలుపుగా మారింది.హౌస్‌లో ఉన్న సమయంలో తనూజ , కళ్యాణ్ మధ్య కనిపించిన స్నేహపూర్వక బంధం ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంది.

హౌస్‌లో తనూజ-కళ్యాణ్ బంధం ఎలా ఉంది?

బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకిరితో ఒకరికి ఉన్న బంధం గురించి చాల గొప్పగా కూడా చెప్పారు. ఒక్కోసారి ప్రేమగా, మరోసారి కోపంగా వ్యవహరించడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, అలకలు, బుజ్జగింపులు వంటి సన్నివేశాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఒక సందర్భంలో కళ్యాణ్ తనూజకు ప్రపోజ్ చేసినట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఇక వీరిద్దరి మధ్య నిజంగా ఏమైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. అంతే కాదు బిగ్ బాస్ స్టేజ్‌పై, బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో, అలాగే మీడియా ఇంటర్వ్యూల్లోనూ ఈ ఇద్దరి రిలేషన్ గురించే ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి. ఇక ఈ ప్రశ్నలకు తనూజ, కళ్యాణ్ ఇద్దరూ చాలా ఓపికగా సమాధానాలు ఇస్తూ వచ్చారు.

రిలేషన్‌పై తనూజ అసలు నిజం వెల్లడి

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన తర్వాత, తనూజ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు , నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. అయితే, మరోసారి ఒక నెటిజన్ తనూజను కళ్యాణ్‌తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించాడు. దీనికి స్పందించిన తనూజ, “మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పాను. కళ్యాణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. హౌస్‌లో అదే ఉంది. ఇకముందు కూడా అదే ఉంటుంది. అంతకుమించి ఏమీలేదు” అని స్పష్టంగా చెప్పింది.

బిగ్ బాస్ హౌస్ తర్వాత కళ్యాణ్ పడాలపై తనూజ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె స్పష్టం చేసినట్లుగా, వారి మధ్య కేవలం బెస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది. ఈ వివరణతో ఎన్నో ఊహాగానాలకు తెరపడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.