
📌 Key Points
- తరుణ్ భాస్కర్‌కు విమానాశ్రయంలో చేదు అనుభవం! ఫ్లైట్ మిస్ కావడంతో అసహనం
- కెమెరాలు వద్దంటూ విలేకరులపై ఫైర్.. వీడియోలు తీస్తున్న వారిపై సీరియస్ అయిన తరుణ్
- విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్.. చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ కావడంతో నిరాశ
- ఈషా రెబ్బతో తరుణ్ భాస్కర్ జోడి.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రొమాంటిక్ ఎంటర్టైనర్!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో చేసిన హంగామా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి చదవండి.
ఫ్లైట్ మిస్ కావడంతో తరుణ్ భాస్కర్ ఆగ్రహం!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. ఇందులో కొంత మంది సక్సెస్ కోసం పోరాడుతుంటే.. మరి కొంత మంది ప్రయోగాల పేరుతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో సక్సెస్ కూడా అవుతున్నారు. ఇలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ( Hero Tharun Bhascker ) ఒకరు. తరుణ్ భాస్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమైన ఆయన… ఇప్పుడు హీరోగా కూడా మారిపోయారు. తాజాగా ఓం శాంతి శాంతి శాంతిః ( Om Shanti Shanti Shantihi Movie ) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నారు తరుణ్ భాస్కర్.
ఓం శాంతి శాంతి శాంతిః సినిమా ( Om Shanti Shanti Shantihi Movie ) రిలీజ్ అయిన నేపథ్యంలో బిజీగా ఉన్న తరుణ్ భాస్కర్ కు తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది. హైదరాబాద్ విమానాశ్రయంలో అతడు వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో తరుణ్ భాస్కర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన సిబ్బందితో కలిసి విదేశాలకు వెళ్లేందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ నిర్ణయం తీసుకున్నాడట. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే తరుణ్ భాస్కర్ వెళ్లాల్సిన ఫ్లైట్ వెళ్లిపోయిందని అంటున్నారు. ఈ విషయం తెలియగానే కాస్త అసంతృప్తికి లోనైన తరుణ్ భాస్కర్… ఆ సమయంలో వీడియోలు తీసిన వాళ్లపై సీరియస్ అయ్యాడు.
వీడియోలు తీస్తున్న వారిపై సీరియస్ వార్నింగ్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన తరుణ్ భాస్కర్ ( Tharun Bhascker ) చాలా యాక్టివ్ గా ఉంటారు. వేదిక పైన కూడా ఉత్సాహంగా మాట్లాడుతారు. అయితే తాను ప్రయాణించాల్సిన విమానం మిస్ కావడంతో, అసంతృప్తి వ్యక్తం చేశారు తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఉన్న కొంతమంది తరుణ్ భాస్కర్ ను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో తరుణ్ భాస్కర్ ఒకసారిగా సీరియస్ అయ్యాడు. కెమెరాలు వద్దు బాబు… వెళ్లిపోండి అని మర్యాదగా చెప్పాడు. అయిన కొంత మంది రెచ్చిపోయి ప్రవర్తించారు. తరుణ్ భాస్కర్ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేంత సేపు వీడియో తీస్తూనే ఉన్నారు. అయితే ఇది చివరి వరకు గమనించిన తరుణ్ భాస్కర్… కారులో కూర్చుని మరి ఆ వీడియో గ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమా ( Om Shanti Shanti Shantihi Movie ) మొన్న జనవరి 30వ తేదీన రిలీజ్ అయింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
A post shared by memesforhappiness (@memes_for_happiness_)
తరుణ్ భాస్కర్ ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


