
మొగలి రేకులు సీరియల్ తో పాపులర్ అయిన ఆర్కే సాగర్, ‘ది 100’ సినిమాతో సినిమా రంగంలోకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆయన తన అనుభవాలను, సినిమా గురించి చెప్పుకొచ్చారు.
Key Points
ఆర్కే సాగర్ హీరోగా 'ది 100' సినిమా రీ-ఎంట్రీ
పవన్ కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేయడం గొప్ప అదృష్టం
సినిమాను 'కలియుగంలో ఒక ఆయుధం'గా ఆర్కే సాగర్ వర్ణన
జులై 11న థియేటర్లలో విడుదల
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్
మొగలి రేకులు సీరియల్‌తో హీరోగా ఎంతో పాపులర్ అయిన ఆర్కే నాయుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్కే సాగర్ హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా ది 100. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా ది 100 తెరకెక్కింది.
జులై 11న థియేటర్లలో ది 100 సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ది 100 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేశాడు.
హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్‌లా అనిపిస్తుంది. అంజనమ్మ ( చిరంజీవి తల్లి) గారు నా సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. వారికి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు గారు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి ధన్యవాదాలు” అని తెలిపాడు.
‘ది 100’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్
“సజ్జనార్ గారు, నాగబాబు గారు అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. పవన్ కల్యాణ్ గారు ట్రైలర్‌ని లాంచ్ చేస్తే అందరికీ రీచ్ అవుతుందని ఆయన్ని వెళ్లి అడిగాను. ఆయన మా ది 100 ట్రైలర్‌ని లాంచ్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి ధన్యవాదాలు” అని ఆర్కే సాగర్ చెప్పాడు.
“ఐటి మినిస్టర్ శ్రీధర్ అన్నతో నాకు చాలా మంచి బాండ్ ఉంది. ఆయన సినిమా చూసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి కోమటిరెడ్డి గారికి థాంక్యూ. మాకు బ్లెస్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది” అని ఆర్కే సాగర్ అన్నాడు.
“మా నిర్మాతలతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. వారి సపోర్ట్‌ని మర్చిపోలేను. డైరెక్టర్ శశి గారు చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో అయినా మంచి పొజిషన్‌లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు” అని ఆర్కే సాగర్ తెలిపాడు.
సినిమాపై ఆర్కే సాగర్ అభిప్రాయాలు
“ఈ సినిమా ఒక వెపన్. ఈ కథ విన్నప్పుటి నుంచి ఆడియన్స్‌కి ఎప్పుడెప్పుడు చూపించాలి అనే ఎగ్జైట్‌మెంట్ ఉండేది. తప్పకుండా ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగం లో ది 100. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి అంత పవర్ ఉంది” అని ఆర్కే సాగర్ చెప్పుకొచ్చాడు.
“ఈ సినిమా మస్ట్‌గా చూడాలి. కమర్షియల్ మూవీ. వెరీ టచింగ్ పాయింట్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థాంక్యూ” అని ఆర్కే సాగర్ తన స్పీచ్ ముగించాడు.
మొత్తంగా, ‘ది 100’ సినిమాపై ఆర్కే సాగర్ చాలా ఆశావహంగా ఉన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నారు.


