|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కామెడీ, ఫన్ డైలాగ్స్‌తో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్.. రిలీజ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Published: 17-09-2025, 1:10 PM
కామెడీ, ఫన్ డైలాగ్స్‌తో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్.. రిలీజ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శేఖర్ కమ్ముల

తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం టీజర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ మరియు శేఖర్ కమ్ముల ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. కామెడీతో నిండిన ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Key Points

1

విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ రిలీజ్ చేశారు.

2

తిరువీర్, టీనా శ్రావ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.

4

ప్రీ-వెడ్డింగ్ షూట్ నేపథ్యంలో సాగే కథ చిత్రీకరణ ఆసక్తికరంగా ఉంది.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ విడుదల

మసూద, పరేషాన్ సినిమాలతో ఆకట్టుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాలో తిరువీర్‌కు జోడీగా టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. 7 పీఎమ్ ప్రొడక్షన్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌‌‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం (సెప్టెంబర్ 16) ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజ‌ర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ చేశారు.

“ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది” అని విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా లో చిత్ర యూనిట్‌ని అభినందించారు.

కామెడీతో ఆకట్టుకునే టీజర్

ఇకపోతే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ మూవీ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే..‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘ఈ మండలం మొత్తంలో బర్త్ డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే చేయించుకుంటారన్నా..’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేశారు.

‘అరే ఈ లైట్ అక్కడ పెట్టు’ అంటూ హీరోయిన్ ముందు హీరో చేసే హడావుడి.. దానికి ఆమె భయపడే తీరు, ‘ఎవండీ మీ ఫొటో తీసుకుని మా గ్యాలరీలో పెట్టుకోవచ్చా’ అని హీరోయిన్‌ని హీరో అడగటం.. దానికి హీరోయిన్ ‘నా ఫొటో ఎందుకు’ అని అనడం.. దానికి సమాధానంగా హీరో ‘అంటే మీరు బావుంటారు కదా’ అని సమాధానం చెబుతాడు.

దానికి హీరోయిన్ ‘ఏశావులే సోపు’ అని వ్యంగ్యంగా కౌంటర్ ఇవ్వటం వంటి డైలాగ్స్ చూస్తుంటే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండవచ్చుననే విషయం తెలుస్తుంది. ఓ సందర్భంలో హీరో ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ఒప్పుకోవటం.. పెళ్లి కూతురు తల్లి కండీషన్స్‌తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే హీరోని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు నవ్వించేలా ఉన్నాయి.

నవంబర్ 7న సినిమా విడుదల

టీజర్ చివరలో హీరో తన అసిస్టెంట్‌తో ‘ఈ డ్రెస్ బావుందారా’ అని అడిగితే ‘హీరోలా ఉన్నావన్నా’ అని అసిస్టెంట్ అంటే హీరో ఏమో షాక్ కావటం వంటి ఫన్నీ సీన్స్‌తో సినిమా పై అంచనాలు పెంచారు మేకర్స్.

కాగా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీలో తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం, కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అవుతున్నాయి. నరేష్ అడుప ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

చివరగా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచింది. నవంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.