|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసుపై వెబ్ సిరీస్.. ఉత్కంఠరేపుతున్న ట్రైలర్

Published: 18-06-2025, 11:19 AM
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసుపై వెబ్ సిరీస్.. ఉత్కంఠరేపుతున్న ట్రైలర్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ‘ద హంట్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. జులై 4 నుంచి సోనీలివ్ లో ప్రసారం కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఉత్కంఠను రేపుతోంది.

Key Points

1

రాజీవ్ గాంధీ హత్య కేసుపై ఆధారంగా వెబ్ సిరీస్ 'ద హంట్'

2

జులై 4 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్

4

అమిత్ సియాల్, సాహిల్ వైద్ నటన

‘ద హంట్’ వెబ్ సిరీస్ విడుదల తేదీ

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ (Former Prime Minister Rajiv Gandhi) హత్య కేసును ఆధారం డైరెక్టర్ నగేశ్‌ కుకునూర్‌ ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ‘ద హంట్‌ (The Hunt: The Rajiv Gandhi Assassination Case)’ పేరుతో రూపొందించిన ఈ సిరీస్ జులై 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (Sony Liv)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సుమారు 35 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో దర్యాప్తు సాగిన తీరు, 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారన్న దానిని ప్రధానంగా చూపించారు. ఇక కొలంబోలోని భారత రాయబార కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ‘రాజీవ్‌ గాంధీ బతికే ఉన్నారా?’ అని ప్రశ్నించే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఉత్కంఠగా సాగింది. ఆ మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ కొన్ని చూపించారు. ఇక ఈ సిరీస్‌లో అమిత్‌ సియాల్‌, సాహిల్‌ వైద్‌, భగవతీ పెరుమాళ్‌ తదితరులు నటించారు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో నాటి దేశ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్‌ గాంధీ హతమయ్యారు.

ట్రైలర్‌లో హైలైట్స్

నటీనటులు

సుమారు 35 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను తెరపైకి తెచ్చిన ఈ వెబ్ సిరీస్, దర్యాప్తు వివరాలతో ఉత్కంఠను పెంచుతుంది. సోనీలివ్‌లో ఈ సిరీస్‌ను తప్పక చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.