
ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన కొత్త రియాలిటీ షో ‘ది లక్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ షోలో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. గెలిచినవారికి భారీ బహుమతి కూడా ఉంది.
Key Points
ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి కొత్త రియాలిటీ షో ‘ది లక్’
గెలుపొందినవారికి 10 లక్షల రూపాయల బహుమతి
ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు
యూట్యూబ్ మరియు ప్రముఖ OTT ప్లాట్ఫామ్లో ప్రసారం
ది లక్ రియాలిటీ షో విశేషాలు
The Luck : ఇటీవల అన్ని ఛానల్స్, ఓటీటీలలో రియాలిటీ షోలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక భాషల్లో అనేక రకాల రియాలిటీ షోలు ఉన్నాయి. ఇప్పుడు మరో రియాలిటీ షో రాబోతుంది. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఒక రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో అందరూ సామాన్యులు మాత్రమే ఉంటారు.(The Luck)
ఈ కొత్త రియాలిటీ షో పేరు ‘ది లక్’. తాజాగా ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించి ‘ది లక్’ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ షోను ఒక పెద్ద సెలబ్రిటీ హోస్ట్ చేస్తారని, యూట్యూబ్, ప్రముఖ ఓటిటిలో స్ట్రీమ్ కానుందని తెలిపారు.
బహుమతి మరియు పాల్గొనే విధానం
ప్రసార తేదీ మరియు ప్లాట్‌ఫామ్
ది లక్ రియాలిటీ షోలో స్థైర్యం, వ్యూహం, ఓర్పు ఆధారంగా సవాళ్లు ఉంటాయని, ఇందులో గెలిచిన ప్రతి విజేతకు 10 లక్షల బహుమతి ఇస్తామని, ఎవరెవరు ఆడతారు అనేది ఎంపిక చేస్తారని. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా షోలో పాల్గొనవచ్చు అని ప్రజా ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఈ షోకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అలాగే ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంటుందని కూడా తెలిపారు.
‘ది లక్’ రియాలిటీ షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షోలో పాల్గొనడానికి ఎటువంటి ఖర్చు లేదు. విజేతలకు 10 లక్షల రూపాయల బహుమతి లభిస్తుంది.


