
📌 Key Points
- నాని కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం.
- ఈ సినిమా 8 భాషల్లో విడుదల కానుంది, విడుదల తేదీ వాయిదా పడింది.
- నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.
- తల్లి కొడుకుల సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.
భారీ బడ్జెట్‌తో ‘ది ప్యారడైజ్’ చిత్రం
The paradise film: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). మొదటిసారి నాని కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుమారు 8 భాషలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ముందుగా మార్చి 26 తేదీ విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు.
ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని తెలుస్తోంది. మార్చ్ 27వ తేదీ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నాని సినిమా షూటింగ్ పనులను ఆలస్యం చేశారు. అయితే ఇప్పుడు పెద్ది సినిమా విడుదల నుంచి తప్పుకుంది అయితే నాని సినిమా షూటింగ్ మాత్రం పూర్తికాని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో వాయిదా పడుతుంది. ఈ సినిమా జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పలువురు నటీనటుల ఫస్ట్ సింగిల్ పోస్టర్లను విడుదల చేశారు. పలు మేకింగ్ వీడియోలను కూడా విడుదల చేశారు.
ఫస్ట్ సింగిల్ విడుదల ఎప్పుడంటే?
ఇకపోతే ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. గత కొద్దిరోజలుగా నాని అభిమానులు ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే నాని పుట్టినరోజు కూడా రాబోతున్న నేపథ్యంలో ఆరోజు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 24న నాని తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు అదే రోజున ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నారని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ నటించబోతున్నారు. ఇక నాని తల్లి పాత్రలో సీనియర్ నటి సోనాలి కులకర్ణి నటించారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈయనతో పాటు తనికెళ్ల భరణి సంపూర్ణేష్ బాబు వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. నాని శ్రీకాంత్ కాంబినేషన్లో ఇదివరకు దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్ లో ది ప్యారడైజ్ సినిమా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ద్వారా నాని పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సిందే.
తల్లి కొడుకుల సెంటిమెంట్ డ్రామా!
మొత్తానికి నాని పుట్టినరోజు కానుకగా ఫస్ట్ సింగిల్ విడుదల కానుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


