|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Paradise: ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Published: 14-11-2025, 4:43 AM
The Paradise: ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల తేదీపై ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాట విడుదల కానున్నట్లు సమాచారం.

Key Points

1

నేచురల్ స్టార్ నాని ఇటీవల 'హిట్ 3'తో ₹100 కోట్లకు పైగా వసూలు చేసి పీక్ స్టేజ్‌లో ఉన్నాడు.

2

దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' టీజర్‌కు మంచి స్పందన లభించింది.

4

అనిరుధ్ సంగీతం అందించిన 'ది ప్యారడైజ్' ఫస్ట్ సాంగ్ డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది.

నాని కెరీర్, ‘ది ప్యారడైజ్’ అంచనాలు

The Paradise: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నాడు. ఆయన నుంచి వస్తున్న దాదాపు (The Paradise)అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు నాని. ఇక ఈ సినిమా తరువాత నాని ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కు ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. నాని లుక్ కూడా మాములుగా లేదు. ఆయన ఈ సినిమాలో ‘గే’ పాత్రలో కనిపించనున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సినిమా వివరాలు, నాని పాత్రపై పుకార్లు

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖండ 2 మళ్ళీ వాయిదా..?

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సాంగ్ విడుదల అప్డేట్

పాన్ ఇండియా లెవల్లో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా 2026 మర్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, ది ప్యారడైజ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అందుకే, ఈ మూవీ సాంగ్స్ పై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ సినిమా ఫస్ట్ సాంగ్ ను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ న్యూస్ తెలియడంతో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.

‘ది ప్యారడైజ్’ సినిమాపై నాని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మొదటి పాట డిసెంబర్ మొదటి వారంలో రానుండటంతో, దీనిపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాట సినిమాకు ఎలాంటి హైప్ తీసుకువస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.