|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Paradise: ధగడ్ ఆగయా.. బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

Published: 28-06-2025, 6:45 AM
The Paradise: ధగడ్ ఆగయా.. బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం తాజా అప్డేట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. షూటింగ్‌లో నాని చేరినట్లు తెలుస్తోంది. 2024 మార్చి 26న విడుదల కానుంది.

Key Points

1

నాని 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో చేరారు

2

బాల్య నాని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది

4

హై బడ్జెట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది

నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో చేరిక

నేచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో రాబోతున్న హై బడ్జెట్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానీష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌లో వేగం పెంచిన చిత్ర బృందం తాజాగా అప్డేట్ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ సెట్స్‌లోకి నాని అడుగుపెట్టినట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

‘ధగడ్ ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో చేరారు.. లాస్ట్ వీక్ బాల్య పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు’ అని తెలుపుతూ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన దసరా సూపర్ సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో వస్తుండటం.. అలాగే ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ కూడా ఆకట్టుకోగా.. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. Link

చిత్రీకరణ తాజా అప్డేట్లు

విడుదల తేదీ ప్రకటన

మొత్తానికి, ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాని మరియు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ తర్వాత ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.