
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇప్పటి వరకు డిసెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
Key Points
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటన.
షూటింగ్స్ బంద్ మరియు VFX పూర్తి చేయడం కోసం వాయిదా వేశారు.
పొంగల్ సీజన్ లో ఇతర సినిమాలతో పోటీ పడే అవకాశం ఉంది.
ది రాజాసాబ్ రిలీజ్ డేట్ వాయిదా
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్ . ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు . ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . ఈ డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు . కానీ ఊహించని విధంగా మరోసారి ఫ్యాన్స్ కు షాకిచ్చారు . వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు .
వాయిదాకు కారణాలు
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు . మిరాయి ట్రైలర్ లాంఛ్ కు హాజరైన ఆయన ది రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు . జనవరి 9న ది రాజాసాబ్ విడుదల చేస్తామని వెల్లడించారు. టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ కారణం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీతో తెరకెక్కిస్తున్నామని అన్నారు. దీంతో రెబల్ స్టార్స్ కొంత నిరాశకు గురవుతున్నారు . కాగా.. ఇప్పటికే పొంగల్ బరిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటితో ది రాజాసాబ్ పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
పొంగల్ బరిలో పోటీ
కాగా .. ఈ చిత్రంలో సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
చివరగా, ది రాజాసాబ్ సినిమా రిలీజ్ వాయిదాతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందవచ్చు. అయితే, హై క్వాలిటీతో సినిమాను రూపొందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.


