|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘట్టమనేని వారసుడి ఎంట్రీతో టాలీవుడ్ షేకింగ్! నరేష్ లుక్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 01-04-2026, 7:30 AM
ఘట్టమనేని వారసుడి ఎంట్రీతో టాలీవుడ్ షేకింగ్! నరేష్ లుక్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయ కృష్ణ ఘట్టమనేని గ్రాండ్ ఎంట్రీ!
  • RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం!
  • నరేష్ ‘స్వతంత్ర బాబు’గా సరికొత్త అవతారం.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
  • తిరుపతిలో భారీ షెడ్యూల్ పూర్తి.. త్వరలో విడుదల తేదీ ప్రకటన!

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్, నటీనటుల వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఘట్టమనేని మూడో తరం ఎంట్రీ!

ఘట్టమనేని మూడో తరంగా ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు సూపర్ స్టార్ క‌ృష్ణ మనవడు జయ కృష్ణ. RX 100, మంగళవారం చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అని టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో ‘జీవితాన్ని తనదైన శైలిలో జీవిస్తూ, ఆస్వాదించే ఒక విలక్షణ పాత్ర.. అనేక వైవిధ్యభరిత పాత్రలతో అలరించే ‘నవరసరాయ’ నరేష్‌ను ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం నుండి ‘స్వతంత్ర బాబు’గా పరిచయం చేస్తున్నాము .. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో, ఇది మరో మైలురాయిగా నిలిచే పాత్ర కాబోతోంది’ అంటూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ చేతిలో రేడియో, ఓ చేతిలో మందు బాటిల్ పట్టుకుని చిల్ అవుతున్నట్లు కనిపిస్తూ నిజంగా స్వతంత్ర బాబులా అలిరిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టైటిల్ రివీల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే ఇటీవల తిరుపతిలో జరిగిన కీలకమైన మూడో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

నరేష్ ‘స్వతంత్ర బాబు’గా అదరగొట్టేసారు!

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ అప్డేట్స్!

జయ కృష్ణ గ్రాండ్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నరేష్ ఫస్ట్ లుక్ అదిరింది! మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.