
📌 Key Points
- ప్రభాస్ సరికొత్త పిలక కట్టు, గుబురు గడ్డం లుక్ ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్‌లో వైరల్.
- సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
- మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కామెడీ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.
- ప్రభాస్ కొత్త లుక్ ‘ఫౌజీ’ లేదా ‘స్పిరిట్’ సినిమాల కోసమా అని అభిమానుల్లో చర్చ.
ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ సరికొత్త లుక్‌తో మెరిసారు. పిలక కట్టుకొని, గుబురు గడ్డంతో కనిపించిన ఆయన లుక్ వైరల్‌గా మారింది. ఈ కొత్త లుక్ ఏ సినిమా కోసమన్న చర్చతో పాటు, రాజా సాబ్ విశేషాలు, విడుదల వివరాలు ఈ కథనంలో.
ప్రభాస్ సరికొత్త లుక్: అభిమానుల్లో చర్చ
The Raja Saab Pre Release: ప్రభాస్ హీరోగా మారుతి (Maruthi)దర్శకత్వములో తెరకెక్కిన చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో నేడు ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పాల్గొనడంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు . ఈ వేడుకకు ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారని చెప్పాలి.
ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పిలక కట్టుకొని, గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ను ఇలా కొత్త లుక్ లో చూసిన అభిమానులు ఈ లుక్ ఏ సినిమాకు సంబంధించినది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘ది రాజా సాబ్’ సినిమా ప్రత్యేకతలు
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ కొత్త లుక్ సందీప్ రెడ్డి సినిమాకు సంబంధించింది కాబోలు అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభాస్ సరికొత్త లుక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇలా తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కామెడీ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంక్రాంతికి రాజా సాబ్: విడుదల వివరాలు
ఇటీవల కాలంలో ప్రభాస్ ను ఈ తరహా పాత్రలలో చూసి చాలా కాలమైంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, సప్తగిరి, వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
ది రాజా సాబ్ సినిమా సంక్రాంతికి విడుదల కానుండగా, ప్రభాస్ కొత్త లుక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ప్రభాస్ లుక్ పై కొనసాగుతున్న చర్చ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది.


