
📌 Key Points
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- క్రిస్మస్ కానుకగా ‘రాజే యువరాజే’ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.
- నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి క్రిస్మస్ కానుకగా ‘రాజే యువరాజే’ ప్రోమో విడుదలైంది. ఈ మ్యూజికల్ సర్ప్రైజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతి 2026న విడుదల కానున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ పై అంచనాలు పెరుగుతున్నాయి.
‘రాజే యువరాజే’ సర్‌ప్రైజ్: ప్రోమో వైరల్!
The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ది రాజా సాబ్ ‘(The Raja Saab). సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 2026 జనవరి 9వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు.. ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సహనా అనే పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిత్ర బృందం అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. ‘ రాజే యువరాజే'(Raje yuva raje) అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన సందడి చేయనున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ విభిన్నమైన కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చే సంక్రాంతి పండుగ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇప్పటికే రెబల్, సహన అనే పాటలను విడుదల చేయగా తాజాగా రాజే యువరాజే అనే పాటకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. మరి జనవరి 9వ తేదీ రాబోతున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈయన చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ది రాజా సాబ్: విడుదల తేదీ, జానర్, హీరోయిన్లు
This Christmas brings a tune to hum and a smile to share ❤️🎄
Here’s our little Musical Surprise #RajeYuvaraje 🫶🏻 #MerryChristmas to all from the #TheRajaSaab team 💫 #TheRajaSaabOnJan9th #Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi @MusicThaman @vishwaprasadtg @peoplemediafcy pic.twitter.com/nEka7IvIAq
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 25, 2025
ప్రభాస్ కెరీర్, ఇతర ప్రాజెక్టులు
ప్రభాస్ ఈ సినిమాతో పాటు మరిన్ని పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో పాటు కల్కి, సలార్ సీక్వెల్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సీక్వెల్ సినిమాల షూటింగ్ మరి కాస్త ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఏంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
‘రాజే యువరాజే’ ప్రోమోతో ‘ది రాజా సాబ్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ప్రభాస్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఇది నిలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


