|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో

Published: 09-12-2025, 9:08 PM
Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
  • అల్లు అర్జున్‌ చిరంజీవి `డాడీ` సినిమాలో అనుకోకుండా నటించారు.
  • బాల నటుడిగా బన్నీ డాన్స్ చూసి చిరంజీవి ఫిదా అయ్యారు, ప్రోత్సహించారు.
  • `డాడీ` తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో అల్లు అర్జున్ `గంగోత్రి`తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
  • చిరంజీవి నటించిన `డాడీ` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.

అల్లు అర్జున్‌ నటించిన `డాడీ` సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిరంజీవి ఆ ఒక్క మాటతో బన్నీ ఎలా నటించారు? బాల నటుడిగా అల్లు అర్జున్ డాన్స్ చూసి మెగాస్టార్ చిరు ఎలా ఫిదా అయ్యారో తెలుసుకుందాం.

బన్నీ నటించింది అనుకోకుండానే!

అల్లు అర్జున్‌ `విజేత` సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. బాల నటుడిగా మెప్పించారు. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత `స్వాతిముత్యం` మూవీలోనూ బాల నటుడిగా కనిపించారు బన్నీ. ఈ రెండు చిత్రాలు ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత దాదాపు 15ఏళ్ల తర్వాత `డాడీ` చిత్రంలో కనిపించారు అల్లు అర్జున్‌. ఇందులో డాన్సర్‌గా అదరగొట్టాడు. ఒక్క మెరుపు మెరిసి తానేంటో చూపించాడు. ఇందులో ఆయన డాన్సుకి చిరంజీవి కూడా ఫిదా అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో బన్నీ `గంగోత్రి` సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే చిరంజీవి నటించిన `డాడీ` సినిమాలో అల్లు అర్జున్‌ నటించడం చాలా యాక్సిడెంటల్‌గా జరిగిందట. ముందుగా ప్లాన్‌ చేయలేదట. ఊహించని విధంగా జరిగిపోయిందని తెలిపాడు బన్నీ. ఓ పాత ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. `ఇది చాలా యాదృశ్చికంగా జరిగింది. అసలు ప్లాన్‌ చేయలేదు. డాడీ సినిమా షూటింగ్‌ సమయంలో నేను పూర్తిగా డిస్కోటిక్‌ ప్రియుడిని. ఆ సమయంలో చిరంజీవిగారు చిన్న డాన్స్‌ బిట్‌ చేస్తావా? అని అడిగారు. నేను ఆయన మాటలను నో చెప్పలేకపోయా. అలా డాడీ జరిగిపోయింది` అని తెలిపారు బన్నీ.

చిరు ఫిదా అయిన బన్నీ డాన్స్

`డాడీ` సినిమాలో చిరంజీవి ఒక డాన్స్ స్కూల్‌ నిర్వహిస్తుంటారు. అందులో చాలా మంది పిల్లలుంటారు. ఓ సమయంలో బన్నీ తానే ఉత్సహంగా ఓ కొత్త రకమైన డాన్స్ స్టెప్పులు వేసి చూపిస్తారు. బన్నీ డాన్సుకి అక్కడ ఉన్న వారంతా ఫిదా అవుతారు. క్లాప్స్ కొడతారు. అరుపులతో హోరెత్తిస్తారు. ఇది విన్న చిరంజీవి ఆఫీస్‌ లో నుంచి బయటకు వచ్చి బన్నీని చూస్తాడు. ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఎంకరేజ్‌ చేస్తాడు. ఇది కాసేపు ఉండే సీన్‌. ఉన్న కొంత సేపు అయినా బన్నీ తనదైన డాన్సులతో అదరగొట్టారు.

చిరంజీవి, సిమ్రాన్‌ జంటగా నటించిన `డాడీ` చిత్రానికి సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించారు. 2001 అక్టోబర్‌ 4న ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. మాస్‌ హీరోగా రాణిస్తున్న చిరంజీవి ఇలాంటి క్లాస్‌ మూవీ, సెంటిమెంట్‌ ఉన్న మూవీ చేయడం ఆడియెన్స్ తీసుకోలేకపోయారు. అభిమానులు నిరాశ చెందారు. ఇందులో పాప చుట్టూ సినిమా తిరుగుతుంది. తన మంచితనం వల్ల చిరంజీవి మొదటి కూతురుని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత రెండో కూతురుకి కూడా అలాంటి పరిస్థితే వస్తుందని చెప్పి సిమ్రాన్‌ చిరంజీవికి దూరంగా ఉంటుంది. ఆ తర్వాత ఎలా కలిశారు? విడిపోవడానికి అసలు కారణం ఏంటనేది సినిమా.

`డాడీ` చిత్రం బాక్సాఫీస్ ఫలితం

ఇక `గంగోత్రి`తో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్‌ `ఆర్య`తో బ్రేక్‌ అందుకున్నాడు. `దేశముదురు`తో స్టార్‌ అయిపోయాడు. `జులాయి`, `రేసు గుర్రం`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `సైనికుడు`, `డీజే`, `అల వైకుంఠపురములో`, `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. పాన్‌ ఇండియా స్టార్‌గా, ఐకాన్‌ స్టార్‌గా ఎదిగారు బన్నీ. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది.

అల్లు అర్జున్‌ బాలనటుడిగా `డాడీ`లో మెరిసిన తీరు, చిరంజీవి ప్రోత్సాహం సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతే బన్నీ హీరోగా మారడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.