|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thiruveer : తండ్రి కాబోతున్న హీరో.. భార్యకు ఘనంగా సీమంతం..

Published: 19-08-2025, 1:23 PM
Thiruveer : తండ్రి కాబోతున్న హీరో.. భార్యకు ఘనంగా సీమంతం..

థియేటర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన తిరువీర్ ఇప్పుడు తండ్రి కాబోతున్నారు. తన భార్య కల్పనకు ఘనంగా సీమంతం నిర్వహించారు. సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

Key Points

1

తిరువీర్ తండ్రి కాబోతున్నారు.

2

భార్య కల్పనకు ఘనంగా సీమంతం జరిగింది.

4

కావ్య కళ్యాణ్ రామ్ సీమంత వేడుకకు హాజరై తన సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు.

తిరువీర్‌ జీవిత విశేషాలు

Thiruveer : థియేటర్ ఆర్టిస్ట్ నుంచి నటుడిగా మారాడు తిరువీర్. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. మసూద సినిమాతో హీరోగా మారి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత పరేషాన్ సినిమాతో మరోసారి మెప్పించాడు. ప్రస్తుతం తిరువీర్(Thiruveer) హీరోగా సినిమాలు చేస్తూనే పలు సినిమాల్లో కీలక పత్రాలు చేస్తున్నాడు.

తిరువీర్ గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తిరువీర్ తండ్రి కాబోతున్నాడు. తిరువీర్ భార్య కల్పన ప్రస్తుతం ప్రగ్నెంట్ కాగా ఘనంగా సీమంతం నిర్వహించారు.

ఘనంగా జరిగిన సీమంతం వేడుక

మసూద సినిమాలో తిరువీర్ కి జంటగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ నిన్న సోమవారం నాడు ఈ సీమంతం వేడుకకు వెళ్లి తిరువీర్ జంటతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది. దీంతో తిరువీర్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.

సినీ ప్రముఖుల హాజరు

తిరువీర్ జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. ఆయనకు, ఆయన భార్యకు అభినందనలు తెలియజేద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.