|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్.. నితిన్ తండ్రికి భారీ నష్టాలు ?

Published: 08-06-2025, 10:49 AM
తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్.. నితిన్ తండ్రికి భారీ నష్టాలు ?

కమల్ హాసన్, మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి, భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

Key Points

1

థగ్ లైఫ్ తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమవుతోంది.

2

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

4

వీకెండ్ కలెక్షన్లు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి.

థగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో 38 ఏళ్ళ తర్వాత తెరకెక్కిన థగ్ లైఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో త్రిష, అభిరామి, శింబు కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏ అంశం కూడా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ చిత్ర పరిస్థితి దారుణంగా ఉంది.

వీకెండ్ కలెక్షన్లు బలంగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావించినప్పటికీ, ఆ అంచనాలను థగ్ లైఫ్ పూర్తిగా వమ్ము చేసింది. విడుదలైన కొన్ని రోజుల నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇక వీకెండ్ ముగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

సుధాకర్ రెడ్డికి భారీ నష్టాలు

ప్రస్తుతం ఫుట్‌ఫాల్స్ చాలా తక్కువగా ఉండటండిస్ట్రిబ్యూటర్ లని ఆందోళనకి గురి చేస్తోంది. భారీ రేట్లకు రైట్స్‌ను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు తప్పవన్నదే పరిశ్రమ అంచనా.

ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో జరిగింది. ప్రముఖ నటుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి అడ్వాన్స్ పద్దతిలో ఈ చిత్ర థియేట్రికల్ హక్కులని 18 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మూడు రోజులు గడిచినప్పటికీ ఈ చిత్రం ఇంతవరకు 2 కోట్ల షేర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో సాధించలేదు.

అంచనాలకు భిన్నంగా ఫలితాలు

దీనితో సుధాకర్ రెడ్డికి భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుధాకర్ రెడ్డి తెలుగులో కమల్ హాసన్ విక్రమ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఆ చిత్రానికి ఆయనకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ థగ్ లైఫ్ చిత్రంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

థగ్ లైఫ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుధాకర్ రెడ్డి భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ విఫలం పరిశ్రమకు పెద్ద హెచ్చరిక.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.