|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ ఫోటోలు నాకు మంచి జ్ఞాపకాలు: శ్రీదేవి విజయ్‌కుమార్‌

Published: 19-08-2025, 12:20 PM
ఆ ఫోటోలు నాకు మంచి జ్ఞాపకాలు: శ్రీదేవి విజయ్‌కుమార్‌

‘సుందరకాండ’ సినిమాలో నటించిన నటి శ్రీదేవి విజయ్‌కుమార్‌, తన పాత్ర గురించి, తన కుటుంబం గురించి, మరియు ప్రభాస్ తో తన అనుభవం గురించి విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.

Key Points

1

శ్రీదేవి విజయ్‌కుమార్‌ ‘సుందరకాండ’ సినిమాలో నటించారు.

2

కొంత గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ వెండితెరకు తిరిగివచ్చారు.

4

ప్రభాస్ తో ఆమె ‘ఈశ్వర్’ సినిమాలో నటించారు.

‘సుందరకాండ’ సినిమా విడుదలకు సిద్ధం

‘‘సుందరకాండ’ మంచి వినోదాత్మక చిత్రం. కథ వినగానే షాక్‌ అయ్యాను. ఈ చిత్రంలో నేను చాలా మంచి బలమైనపాత్ర చేశాను. అందరూ థియేటర్స్‌కి వెళ్లిచూడొచ్చు’’ అని హీరోయిన్  శ్రీదేవి విజయ్‌కుమార్‌ తెలిపారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్‌ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు.

శ్రీదేవి విజయ్‌కుమార్‌ కెరీర్ గురించి

సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ వెండితెరపై నన్ను నేను చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని, ఓపాపకి జన్మనిచ్చాను. ఆ తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్‌ చేశాను. ఇప్పుడు నా కుమర్తె స్కూల్‌కు వెళుతోంది. సో.. నేను మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాను.

ప్రభాస్ తో ఆమె అనుభవం

ఈ సినిమాలో నేను స్కూల్‌ డ్రెస్‌లో కనిపించే సన్నివేశం ఉంది. ఈ సీన్  కోసం చాలా కష్టపడ్డాను. డైట్‌ ఫాలో అయ్యాను. నా కుమార్తె, నేను స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.. ఇవి నాకు మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ప్రభాస్‌గారి తొలి సినిమా ‘ఈశ్వర్‌’లో నేను హీరోయిన్ గా చేశాను.. తను పెద్ద స్టార్‌ అవుతాడని మేం అప్పుడే ఊహించాం.. మేం ఊహించినదాని కన్నా పెద్ద స్టార్‌ అయ్యారు’’ అని చెప్పారు.

శ్రీదేవి విజయ్‌కుమార్ తన కెరీర్‌లోని అనుభవాలను, ‘సుందరకాండ’ సినిమా విడుదల గురించి వివరించారు. ప్రేక్షకుల ఆదరణ కోసం ఆమె ఆశించారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.